హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 1st ODI : టాస్ నెగ్గిన టీమిండియా.. అరంగేట్రం చేయనున్న ధోని శిష్యుడు.. తుది జట్లు ఇవే

IND vs SA 1st ODI : టాస్ నెగ్గిన టీమిండియా.. అరంగేట్రం చేయనున్న ధోని శిష్యుడు.. తుది జట్లు ఇవే

PC : BCCI

PC : BCCI

IND vs SA 1st ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా లక్నో వేదికగా జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ ఎట్టకేలకు ఆరంభం కానుంది. వర్షం కారణంగా మ్యాచ్ దాదాపుగా 2 గంటలకు పైగా ఆలస్యంగా ఆరంభం కానుంది. మ్యాచ్ 3.45 గంటలకు ఆరంభం కానుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 1st ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా లక్నో వేదికగా జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ ఎట్టకేలకు ఆరంభం కానుంది. వర్షం కారణంగా మ్యాచ్ దాదాపుగా 2 గంటలకు పైగా ఆలస్యంగా ఆరంభం కానుంది. మ్యాచ్ 3.45 గంటలకు ఆరంభం కానుంది. టాస్ నెగ్గిన టీమిండియా (Team India) కెప్టెన్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక భారత్ తరఫున ధోని శిష్యుడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad), రవి బిష్ణోయ్ (Ravi Bishnoi)లు ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. అరంగేట్రం చేయాలని ఆశపడ్డ రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠిలకు మరోసారి నిరాశే మిగిలింది. ఇక సౌతాఫ్రికా మూడో టి20 జట్టుకు స్వల్ప మార్పులు చేసింది. జనెమన్ మలాన్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. క్లాసెన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. టి20 సిరీస్ లో ఆడిన స్టబ్స్, రోసోలు వన్డే సిరీస్ లో లేరు.

40 ఓవర్ల చొప్పున

వర్షం కారణంగా మ్యాచ్ దాదాపు 2 గంటలకు పైగా ఆలస్యంగా ఆరంభం కానుంది. దాంతో అంపైర్లు మ్యాచ్ ఓవర్లను కుదించారు. ఇన్నింగ్స్ కు 40 ఓవర్ల చొప్పున మ్యాచ్ జరగనుంది. పవర్ ప్లేను 8 ఓవర్లకు కుదించారు. ఒక బౌలర్ మాత్రమే గరిష్టంగా 8 ఓవర్లు వేయాల్సి ఉంది. మొదటి పవర్ ప్లే 1-8 మధ్య ఉంటుంది. రెండో పవర్ ప్లే 9-32 వరకు.. మూడో పవర్ ప్లే 33-40 ఓవర్ల మధ్య ఉంటుంది.

మరోసారి నిరాశ

దేశవాళి క్రికెట్ తో పాటు ఇటీవలె న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్ లో అద్భుతంగా ఆడిన రజత్ పటిదార్ అరంగేట్రం చేస్తాడని అంతా అనుకున్నారు. అతడితో పాటు రాహుల్ త్రిపాఠికి కూడా అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ వీరిద్దరికి నిరాశే మిగిలింది. ఇప్పటికే టి20ల్లో అరంగేట్రం చేసిన ప్లేయర్లనే కొనసాగించేందుకే టీమిండియా మొగ్గు చూపింది. సంజూ సామ్సన్ రూపంలో ఒక వికెట్ కీపర్ ఉన్నా ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే దీపక్ చహర్ కు విశ్రాంతి ఇచ్చారు. అతడు టి20 ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బైగా ఉన్నాడు. వర్షం పడటంతో అతడిని ఆడించేందుకు భారత్ ఇష్టపడలేదు. ఆసియా కప్ లో అనారోగ్యం బారిన పడి జట్టుకు దూరమైన అవేశ్ ఖాన్ మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు టీమిండియా

శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్, ఇషాన్ కిషన్,  శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(కీపర్), శార్దుల్ ఠాకూర్,  మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్

సౌతాఫ్రికా

తెంబా బవుమా (కెప్టెన్), మలాన్, డికాక్, మార్కరమ్, క్లాసెన్, మిల్లర్, పార్నెల్, కేశవ్ మహరాజ్, రబడ, ఎంగిడి, షమ్సీ

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs South Africa, Lucknow, Mohammed Siraj, Sanju Samson, Shikhar Dhawan, South Africa, Team India

ఉత్తమ కథలు