హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 1st ODI : ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి.. సామ్సన్ కష్టాన్ని బూడిద పాలు చేసిన ఆవేశం స్టార్

IND vs SA 1st ODI : ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి.. సామ్సన్ కష్టాన్ని బూడిద పాలు చేసిన ఆవేశం స్టార్

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 1st ODI : చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా (South Africa) ఊపిరిపీల్చుకుంది. బౌలింగ్ కు సహకరించిన పిచ్ పై 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ (India).. 40 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 1st ODI : చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా (South Africa) ఊపిరిపీల్చుకుంది. బౌలింగ్ కు సహకరించిన పిచ్ పై 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ (India).. 40 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (63 బంతుల్లో 86 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఓవర్లో 31 పరుగులు అవసరం కాగా.. సామ్సన్ 6, 4, 4, 0, 4, 1 బాదడంతో 20 (ఒక వైడ్) పరుగులు లభించాయి. అయినప్పటికీ అది విజయాన్ని మాత్రం ఖాయం చేయలేదు. శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 50; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. చివర్లో శార్దుల్ ఠాకూర్ (31 బంతుల్లో 33; 5 ఫోర్లు) సంజూ సామ్సన్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీశాడు. కగిసో రబడ 2 వికెట్లు సాధించాడు.

సామ్సన్ ఒక్కడే

బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఛేదనకు దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. శుబ్ మన్ గిల్ (3), శిఖర్ ధావన్ (4) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఇక టెస్టు బ్యాటింగ్ చేసిన అరంగేట్రం స్టార్ రుతురాజ్ గైక్వాడ్ (42 బంతుల్లో 19), ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 30) భారత్ ను లక్ష్యం వైపు నడపలేకపోయారు. అయితే శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్ లు లక్ష్యం వైపు నడిపారు. శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడాడు. ఫలితంగా భారత్ లక్ష్యం వైపు నడిచింది. అయితే అర్ద సెంచరీ చేసిన తర్వాత అయ్యర్ పెవిలియన్ కు చేరాడు. ఇక క్రీజులోకి వచ్చిన శార్దుల్ కూడా రెచ్చిపోయి ఆడాడు. మరో ఎండ్ లో అప్పటి వరకు స్ట్రయిక్ రొటేట్ చేసిన సంజూ సామ్సన్ చెలరేగిపోయాడు. దాంతో భారత్ ఛేజ్ చేసేలా కనిపించింది. అయితే ఎంగిడి 38వ ఓవర్లో శార్దుల్ తో పాటు కుల్దీప్ యాదవ్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు.

కొంపముంచిన 39వ ఓవర్

చివరి రెండు ఓవర్లలో భారత్ గెలవాలంటే 38 పరుగులు కావాలి. అయితే స్ట్రయికింగ్ ఎండ్ లో అవేశ్ ఖాన్ ఉన్నాడు. నాన్ స్ట్రయికింగ్ లో సంజూ సామ్సన్ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే సింగిల్ తీసి ఫామ్ లో ఉన్న సంజూ సామ్సన్ కు స్ట్రయికింగ్ అందిస్తారు. అయితే అవేశ్ ఖాన్ మాత్రం అలా చేయలేదు. బౌలింగ్ లో చెత్త ప్రదర్శన చేసిన అతడు బ్యాటింగ్ లోనూ టీమిండియా విజయావకాశాలను చేజార్చాడు. ఆ ఓవర్లో 4 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో సింగిల్ తీసి ఇవ్వమని అవేశ్ ఖాన్ తో సంజూ చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 5వ బంతికి అవేశ్ ఖాన్ అవుటయ్యాడు. చివరి బంతికి బిష్ణోయ్ అవుటైనా అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఇక ఆఖరి బంతికి ఫోర్ వెళ్లడంతో భారత్ చివరి ఓవర్లో గెలవాలంటే 31 పరుగులు అవసరం అయ్యాయి. అయితే సామ్సన్ మాత్రం 20 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs South Africa, Lucknow, Mohammed Siraj, Sanju Samson, Shikhar Dhawan, Shreyas Iyer, South Africa

ఉత్తమ కథలు