హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 1st ODI : శార్దుల్ మెరిసినా.. కిల్లర్ ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన మిల్లర్, క్లాసెన్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

IND vs SA 1st ODI : శార్దుల్ మెరిసినా.. కిల్లర్ ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన మిల్లర్, క్లాసెన్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 1st ODI : వర్షంతో ఆలస్యంగా ఆరంభమైన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా (South Africa) మెరుగైన స్కోరును సాధించింది. భారత్ (India)తో లక్నో (Lucknow) వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 1st ODI : వర్షంతో ఆలస్యంగా ఆరంభమైన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా (South Africa) మెరుగైన స్కోరును సాధించింది. భారత్ (India)తో లక్నో (Lucknow) వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై డేవిడ్ మిల్లర్ (63 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), క్లాసెన్ (64 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (54 బంతుల్లో 48; 5 ఫోర్లు) తన ఫామ్ ను కనబరిచాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ తీశారు.

శార్దుల్ సూపర్

పేలవ ఫామ్ తో జట్టులో స్థానం కోల్పోయిన శార్దుల్ ఠాకూర్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో అదరిపోయే ప్రదర్శన చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాను ఆరంభ ఓవర్లలో సిరాజ్ తో కలసి హడలెత్తించాడు. పిచ్ బౌలింగ్ కు సహరిస్తుండటంతో సఫారీ ఓపెనర్లు మలాన్ (22), క్వింటన్ డికాక్ లు ఆరంభంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నెమ్మదిగా ఆడిన వీరు తొలి వికెట్ కు 49 పరుగులు జోడించారు. తీవ్రంగా ఇబ్బంది పడ్డ మలాన్ ను శార్దుల్ పెవిలియన్ కు పంపాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ బవుమా (8) మరోసారి నిరాశ పరిచాడు. శార్దుల్ ఠాకూర్ అద్భుత ఇన్ స్వింగర్ కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మార్కరమ్ (0)ను కుల్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సఫారీ జట్టు 22 పరుగుల తేడాలో 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే క్రీజులోకి వచ్చిన క్లాసెన్ తో కలిసి డికాక్ నాలుగో వికెట్ కు 39 పరుగులు జోడించాడు. దాంతో జట్టు స్కోరు 100 దాటింది. అయితే డికాక్ రవి బిష్ణోయ్ బౌలింగ్ లో ఎల్బీగా అవుటయ్యాడు.

కిల్లర్ మిల్లర్

సూపర్ ఫామ్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ జట్టును మరోసారి ఆదుకున్నాడు. క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన అతడు క్లాసెన్ తో కలిసి జట్టును ఆదుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన అతడు 100 స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ సింగిల్స్ తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అదే సమయంలో భారత ఫీల్డర్లు కూడా కొన్ని క్యాచ్ లను మిస్ చేశారు. ఫలితంగా ఇద్దరు అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఇక చివర్లో క్లాసెన్ కూడా కొన్ని చూడచక్కని సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా అవేశ్ ఖాన్ బౌలింగ్ లో యార్కర్ ను కవర్స్ మీదుగా బాదిన సిక్సర్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. వీరిద్దరూ సూపర్ ఫినిష్ ఇవ్వడంతో భారత్ ముందు ఫైటింగ్ టోటల్ సౌతాఫ్రికా సెట్ చేసింది.

40 ఓవర్ల చొప్పున

వర్షం కారణంగా మ్యాచ్ దాదాపు 2 గంటలకు పైగా ఆలస్యంగా ఆరంభం కానుంది. దాంతో అంపైర్లు మ్యాచ్ ఓవర్లను కుదించారు. ఇన్నింగ్స్ కు 40 ఓవర్ల చొప్పున మ్యాచ్ జరగనుంది. పవర్ ప్లేను 8 ఓవర్లకు కుదించారు. ఒక్కో బౌలర్ మాత్రమే గరిష్టంగా 8 ఓవర్లు వేయాల్సి ఉంది. మొదటి పవర్ ప్లే 1-8 మధ్య ఉంటుంది. రెండో పవర్ ప్లే 9-32 వరకు.. మూడో పవర్ ప్లే 33-40 ఓవర్ల మధ్య ఉంటుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs South Africa, Mohammed Siraj, Sanju Samson, Shikhar Dhawan, South Africa, Team India

ఉత్తమ కథలు