హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 1st ODI : మరింత ఆలస్యంగా తొలి వన్డే.. లక్నోలో భారీ వర్షం.. టాస్ ఎప్పుడంటే?

IND vs SA 1st ODI : మరింత ఆలస్యంగా తొలి వన్డే.. లక్నోలో భారీ వర్షం.. టాస్ ఎప్పుడంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 1st ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా భారత్ (India), సౌతాఫ్రికా (South Africa) జట్ల మధ్య తొలి వన్డే లక్నో (Lucknow ) వేదికగా గురువారం జరగాల్సి ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 1st ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా భారత్ (India), సౌతాఫ్రికా (South Africa) జట్ల మధ్య తొలి వన్డే లక్నో (Lucknow ) వేదికగా గురువారం జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కావాలి. అయితే లక్నోలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఆలస్యం కానుంది. గ్రౌండ్ ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ ను అరగంటపాటు వాయిదా వేశారు. దాంతో టాస్ ను 1.00 గంట నుంచి 1 .30 గంటలకు మార్చారు. అయితే మరోసార వర్షం రావడంతో మరోసారి టాస్ వాయిదా పడింది. టాస్ ను మధ్యాహ్నం గం. 2.30లకు వేయనున్నారు.

భారీ వర్షం

లక్నోలో గత రెండు రోజులగా భారీ వర్షం కురుస్తోంది.  ఫలితంగా గ్రౌండ్ అంతా చిత్తడిగా మారిపోయింది. ఇక గురువారంతో సహా మరో వారం రోజుల పాటు లక్నోకు భారీ వర్ష సూచన ఉంది. దాంతో తొలి వన్డే జరిగేది అనుమానమే. టి20 ప్రపంచకప్ లో పాల్గొనే ప్లేయర్లతోనే దక్షిణాఫ్రికా ఈ వన్డే సిరీస్ ను ఆడనుంది. 3 గంటల లోపు మ్యాచ్ ఆరంభం అయితే ఫుల్ మ్యాచ్ జరుగుతుంది. లేదంటే ఓవర్లను కుదించే అవకాశం ఉంది.

స్టార్ ప్లేయర్స్ లేని వేళ జట్టు కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకునే కుర్రాళ్లు ఎవరో మరి కొద్ది గంటల్లో తేలనుంది. రజత్ పటీదార్.. సౌతాఫ్రికాతో జరిగే తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతను 9 మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలతో పాటు 5 హాఫ్ సెంచరీలు బాదాడు. అయితే రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్‌, రుతురాజ్ గైక్వాడ్‌లతో అతనికి తీవ్ర పోటీ ఎదురుకానుంది. సీనియర్‌‌కు ప్రాధానత్య ఇవ్వాలని భావిస్తే ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడు. అప్పుడు రజత్ పటీదార్ వేచి చూడాల్సి ఉంటుంది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఆడటం ఖాయం. ధావన్ కెప్టెన్ కావడంతో పాటు జట్టులో అత్యంత సీనియర్. ఇక శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని వన్డే ప్రపంచకప్ కోసం సిద్దం చేస్తున్నారు. అంతేకాకుంగా వెస్టిండీస్ పర్యటనలో అతను సత్తా చాటాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, India vs South Africa, Lucknow, Mohammed Siraj, Sanju Samson, Shikhar Dhawan, Team India

ఉత్తమ కథలు