Home /News /sports /

IND VS PAK THE T20 WORLD CUP IS IN FULL SWING BETWEEN COUSIN TEAMS FULL BUZZ ON SOCIAL MEDIA GH EVK

Ind Vs Pak: దాయాది జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ జోరు.. సోష‌ల్ మీడియాలో మొద‌లైన ర‌చ్చ‌!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

India vs Pakistan | భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు.. ఇరు దేశాల అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రెండు జ‌ట్ల మ‌ధ్య ప్ర‌త్యేక సిరీస్ లేక‌పోవ‌డంతో ఐసీసీ ట్రోఫీలో మాత్ర‌మే ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్‌లో ఈ రెండు దేశాలు పోటీ ప‌డ‌బోతున్నాయి. దీంతో సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ర‌చ్చ మొద‌లైంది.

ఇంకా చదవండి ...
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ (Cricket) మ్యాచ్ ఉందంటే చాలు.. ఇరు దేశాల అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అసలే ద్వైపాక్షిక సిరీస్ రెండు జట్ల మధ్య లేకపోవడంతో ప్రపంచకప్, ఛాంపియన్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక ఐసీసీ(ICC) టోర్నీల్లో దాయాది జట్లు పోటీ పడేలా ఐసీసీ (ICC) ప్రణాళికను రచిస్తుంది. తాజాగా ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లోనూ(T20 World Cup 2022) భారత్-పాక్ ఒకే గ్రూపులో తలపడనున్నాయి. ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో అక్టోబరు 23న మ్యాచ్ ఆడనున్నాయి. శుక్రవారం నాడు ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్‌ను (World cup 2022 Schedule) ఐసీసీ ప్రకటించింది.

Virat Kohli Earnings: విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఎంత జీతం ఇచ్చింది.. బ్రాండ్ వాల్యు ఎంతో తెలుసా?


భారత్-పాక్ గ్రూప్-బీలో తలపడనున్నాయి. ఈ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా (South Africa), బంగ్లాదేశ్ మరో రెండు క్వాలిఫయింగ్ జట్లు కూడా ఆడనున్నాయి. గ్రూప్-ఏ లో ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ (England), అఫ్గనిస్థాన్‌తో పాటు మరో రెండు జట్లు తలపడతాయి. మొత్తం ఈ టోర్నీలో 12 దేశాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

గత టీ20 ప్రపంచకప్‌లో దాయాది జట్లు టోర్నీలో మొదటి మ్యాచ్‌లోనే తలపడ్డాయి. అయితే టీమిండియా పాక్‌ చేతిలో ఘోర పరాజయం చెంది అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సారి సూపర్-12 దశలో భారత్‌, పాక్‌ను ఢీకొట్టబోతుంది. దీంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 23న జరగనున్న ఈ మ్యాచ్‌పై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.

నెట్టింట ముందే మొదలైన పోరు..
ఇప్పటికే సోషల్ మీడియా (Social Media) లో ఈ అంశం ట్రెండ్ అవుతోంది. ఎప్పుడు దాయాది జట్ల మధ్య మ్యాచ్ జరిగినా మౌకా మౌకా అనే ప్రకటన పాపులరవుతోంది. ఇప్పుడు కూడా మరోసారి మౌకా వచ్చిందని అభిమానులు ఖుషీ అవుతున్నారు. నెటిజన్లు ఈ మ్యాచ్ గురించి విశేషంగా స్పందిస్తున్నారు. మెల్‌బోర్న్ మైదానంలో ఇరుజట్ల మధ్య తీవ్రంగా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. ఆ మ్యాచ్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నానని ఒకరు పోస్ట్ చేయగా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) ఏమేరకు ఆకట్టుకుంటాడో అని మరోకరు కామెంట్ చేశారు. 6604 గంటల 40 నిమిషాల తర్వాత భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగబోతుందని ఇంకొకరు స్పందించారు. భారత్ ఏకపక్షంగా పాక్‌ను ఓడిస్తుందని మరో అభిమాని వ్యాఖ్యానించాడు.



Sports: క్రీడాకారుడి క‌ల చెదిరిపోయేలా ఉంది.. క‌రోనా టీకా తీసుకోనందుకు వీసా ర‌ద్దు!

గత ప్రపంచకప్‌లో పాక్ చేతిలో భారత్ 10 వికెట్లతో ఘోర పరాజయం చెందింది. షాహిన్ అఫ్రిదీ స్పిన్ మాయాజాలానికి ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్ వెనువెంటనే ఔటవగా, కోహ్లీ అర్ధసెంచరీతో, పంత్ 39 పరుగులతో ఓ మేరకు రాణించారు.



ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పాక్ ఎలాంటి వికెట్ కోల్పోకుండా రెండు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్(68), మహ్మద్ రిజ్వాన్(79) అధ్భుత ప్రదర్శనతో తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Published by:Sharath Chandra
First published:

Tags: Cricket, India pakistan, India VS Pakistan, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు