హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : ఇండియా వర్సెస్ పాక్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి అంటే?

IND vs PAK : ఇండియా వర్సెస్ పాక్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి అంటే?

Ind Vs Pak (Twitter)

Ind Vs Pak (Twitter)

IND vs PAK : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 23న) భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. సూపర్ 12లో గ్రూప్ ‘2’లో భాగంగా జరిగే ఈ పోరులో గెలిచిన జట్టుకు అడ్వాంటేజ్ ఉండనుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs PAK : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 23న) భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. సూపర్ 12లో గ్రూప్ ‘2’లో భాగంగా జరిగే ఈ పోరులో గెలిచిన జట్టుకు అడ్వాంటేజ్ ఉండనుంది. ఇక ఈ మ్యాచ్ లో విజయం కోసం రెండు జట్లు కూడా హోరాహోరీగా తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. విఖ్యాత స్టేడియం ఎంసీజీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ను దాదాపుగా లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఇక టి20 ఫార్మాట్ లో ఈ రెండు జట్ల ముఖా ముఖి రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇది కూడా చదవండి : షాహీన్ అఫ్రిదికి ఎలా చెక్ పెట్టాలో చెప్పిన క్రికెట్ గాడ్ సచిన్.. రోహిత్, రాహుల్ పాటిస్తారా మరీ?

హెడ్ టు హెడ్

టి20 ఫార్మాట్ లో ఈ రెండు జట్లు కూడా ఇప్పటి వరకు 11 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 8 సార్లు విజయం సాధించింది. మూడు సార్లు పాకిస్తాన్ నెగ్గింది. దీనిని బట్టి టి20 ఫార్మాట్ లో పాక్ పై టీమిండియాదే ఆధిపత్యం అని తెలుస్తుంది.

టి20 ప్రపంచకప్ లో

ఇక టి20 ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు కూడా ఇప్పటి వరకు 6 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 5 సార్లు విజయం సాధిస్తే పాకిస్తాన్ ఒకసారి నెగ్గింది. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్ లో పాక్ పై భారత్ రెండు సార్లు నెగ్గింది. ఇక 2012, 2014, 2016 ప్రపంచపక్ లలో కూడా ఈ రెండు జట్ల మధ్య ప్రపంచకప్ లలో మ్యాచ్ లు జరగ్గా అందులో భారత్ నెగ్గింది. అయితే గతేడాది (2021) జరిగిన టి20 ప్రపంచకప్ లో మాత్రం టీమిండియాపై పాకిస్తాన్ విజయం సాధించింది. ప్రపంచకప్ (వన్డే, టి20ల్లో) వేదికపై టీమిండియాను ఓడించడం అదే ప్రథమం కావడం విశేషం.

బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్

ఇక ఈ మ్యాచ్ భారత్ బ్యాటింగ్ కు పాకిస్తాన్ బౌలింగ్ కు మధ్య జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. రోహిత్, కోహ్లీ, రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లతో టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లు మ్యాచ్ ను ఫినిష్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ పేస్ త్రయం షాహీన్ అఫ్రిది, నసీం షా, హారీస్ రవూఫ్ భారత బ్యాటర్లకు సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో భారత బ్యాటర్లకు పాకిస్తాన్ బౌలింగ్ కు మధ్య జరిగే సమరం క్రికెట్ అభిమానులను అలరించడం ఖాయం.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్/చహల్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్.

First published:

Tags: Babar Azam, IND vs PAK, India VS Pakistan, Mohammed Shami, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు