Home /News /sports /

IND vs NZ: నేటి నుంచే టెస్టు సిరీస్.. డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమవుతున్న టీమ్ ఇండియా.. గెలుపెవరిదో?

IND vs NZ: నేటి నుంచే టెస్టు సిరీస్.. డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమవుతున్న టీమ్ ఇండియా.. గెలుపెవరిదో?

నేటి నుంచి కాన్పూర్ వేదికగా ఇండియా - న్యూజీలాండ్ తొలి టెస్టు.. (PC: BCCI)

నేటి నుంచి కాన్పూర్ వేదికగా ఇండియా - న్యూజీలాండ్ తొలి టెస్టు.. (PC: BCCI)

IND vs NZ: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత తొలి సారిగా ఇండియా - న్యూజీలాండ్ జట్లు టెస్టు మ్యాచ్‌లో తలపడుతున్నాయి. అప్పటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తుండగా.. ఇండియాలో టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని కివీస్ ఆరాటపడుతున్నది. వీరి పోరాటానికి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదిక కానున్నది.

ఇంకా చదవండి ...
  ఐసీసీ (ICC) ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న రెండు మేటి క్రికెట్ జట్ల మధ్య నేటి నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నది. ఐదు నెలల క్రితం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో (WTC Final) ఓడించిన న్యూజీలాండ్‌పై (New Zealand) ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా (Team India) బరిలోకి దిగుతుండగా.. ఇప్పటి వరకు ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవని న్యూజీలాండ్ అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చరిత్ర సృష్టించాలని భావిస్తున్నది. భారత జట్టు కివీస్‌తో ఆడిన చివరి మూడు టెస్టులు ఓడిపోయింది. భారత జట్టు చివరి సారిగా 2016 అక్టోబర్‌లో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో 321 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టుల్లో టీమ్ ఇండియా ఓడిపోయింది. ఇందులో రెండు మ్యాచ్‌లు కివీస్ గడ్డపై జరగగా.. మరో మ్యాచ్ ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్. అయితే ఈ మూడు మ్యాచ్‌లలో కివీస్‌కు అనుకూలమైన పరిస్థితులే ఉండటంతో ఆ జట్టుదే పైచేయి అయ్యింది. ఇక ఇప్పుడు కివీస్‌కు అసలైన పరీక్ష ఎదురుకాబోతున్నది.

  ఇండియా గడ్డపై కివీస్ చివరి సారిగా 1988లో టెస్టు మ్యాచ్ గెలిచింది. కానీ ఆ సిరీస్‌ను 2-1తో ఇండియా గెలిచింది. తొలి టెస్టు 1955లో ఆడగా.. గత 66 ఏళ్లలో కివీస్ ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదు. అయితే ఈ సారి సీనియర్ల గైర్హాజరీలో భారత యువ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్ర సృష్టించాలని కేన్ విలియమ్‌సన్ నేతృత్వంలోని న్యూజీలాండ్ జట్టు ఉవ్వీళ్లూరుతున్నది. టీమ్ ఇండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు అసలు పరీక్ష ఈ టెస్టు సిరీస్. ఒకప్పుడు టెస్టుల్లో ది వాల్ అని పేరు తెచ్చుకున్న ద్రవిడ్ యువకులకు ఎలా దిశానిర్దేశం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే కోచ్ రాహుల్, కెప్టెన్ అజింక్య రహానే ఇప్పటికే జట్టు కూర్పును పూర్తి చేశారు.

  IPL 2022: జనవరిలో ఐపీఎల్ 2022 మెగా వేలం.. ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోనున్న ఆటగాళ్లు వీళ్లే.. లిస్టులో ఎవరున్నారో చూడండి..!


  యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. తాజాగా టెస్టు జట్టుకు ఎంపిక అయిన సూర్యకుమార్ అవకాశం కోసం మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. అయితే కేఎల్ రాహుల్ లేకపోవడం పెద్ద లోటు కాదని రహానే అన్నాడు. రాహుల్-రోహిత్ బదులు మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా రాబోతున్నారు. కోహ్లీ గైర్హాజరీలో ఫస్ట్ డౌన్‌లో చతేశ్వర్ పుజార.. నాలుగో స్థానంలో అజింక్య రహానే బ్యాటింగ్ చేయబోతున్నారు. హనుమ విహారి, రిషబ్ పంత్ బదులు ఆ స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, వృద్దిమాన్ సాహకు బ్యాటింగ్ చేసే అవకాశం రాబోతున్నది. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా తుది జట్టులో ఉండే అవకాశం ఉన్నది, అశ్విన్‌కు స్నిన్నర్ కోటాలో అవకాశం దక్కుతుంది. అయితే పేస్ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉన్నది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకంటే అక్షర్ పటేల్ కూడా చోటు దక్కించుకోవచ్చు.

  ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీకి షాక్.. టాప్ 10 నుంచి అవుట్.. లిస్టులో ఒకే ఒక్క భారతీయుడు   న్యూజీలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ టెస్టుల కోసమే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పడు అతడు తిరిగి జట్టులో చేరడంతో బ్యాటింగ్ బలం పెరిగింది. గాయం కారణంగా డెవాన్ కాన్వే టెస్టులకు దూరం అవడంతో టామ్ లాథమ్, విల్ యంగ్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. టామ్ బండెల్ వికెట్ కీపర్‌గా జట్టులోకి రానున్నాడు. ఇక టాపార్డర్‌లో కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్ ఎంతో అనుభవం ఉన్న టెస్టు ప్లేయర్లు.హెన్రీ నికోల్స్ కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నది. అయితే కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ చెప్పిన దాని ప్రకారం తొలి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే అజాజ్ పటేల్, విల్ సోమర్‌విల్లేకు జట్టులో అవకాశం ఉంటుంది. వీరిద్దరితో పాటు హెన్రీ నికోల్స్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఫాస్ట్ బౌలర్లలో టిమ్ సౌథీ జట్టులో ఉంటాడు. అయితే మిచెల్ సాంట్నర్ లేదా కేల్ జేమిసన్‌లో ఒకరికే అవకాశం దక్కవచ్చు. వీరిలో జేమిసన్ గాయం కారణంగా వరల్డ్ కప్ కూడా ఆడలేదు. అతడు పూర్తిగా ఫిట్ ఉంటేనే జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నది.


  జట్ల అంచనా:

  ఇండియా:
  మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజార, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, వృద్దిమాన్ సాహ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్/ఉమేష్ యాదవ్

  న్యూజీలాండ్:
  టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్‌సన్ (కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్, మిచెల్ సాంట్నర్/కేల్ జేమిసన్, టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్, విల్ సోమర్‌విల్లే, అజాజ్ పటేల్
  Published by:John Kora
  First published:

  Tags: India vs newzealand, Rahul dravid, Shreyas Iyer, Team india

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు