Home /News /sports /

IND VS NZ TOSS DELAYED DUE TO DAMP OUTFIELD INSPECTION AT 9 30 AM JNK

IND vs NZ: ముంబైలో ఆగిన వర్షం.. కానీ ఇండియా - న్యూజీలాండ్ మ్యాచ్‌కు ఒకే అడ్డంకి.. మ్యాచ్ కాస్త ఆలస్యం..

ఇండియా - న్యూజీలాండ్ మధ్య ముంబైలో జరగాల్సిన మ్యాచ్ కాస్త ఆలస్యం (PCL BCCI)

ఇండియా - న్యూజీలాండ్ మధ్య ముంబైలో జరగాల్సిన మ్యాచ్ కాస్త ఆలస్యం (PCL BCCI)

IND vs NZ: ఇండియా - న్యూజీలాండ్ మధ్య కీలకమైన రెండో టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్నది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతోపాటు పిచ్ కూడా కాస్త తడిగా మారింది. దీంతో మ్యాచ్ ఆలస్యం అవుతున్నది. 9.30కు మ్యాచ్ అఫిషియల్స్ పిచ్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.

ఇంకా చదవండి ...
  ఇండియా - న్యూజీలాండ్ (India vs New Zealand) మధ్య జరగాల్సిన రెండో టెస్టు (Second Test) మ్యాచ్‌కు వర్షం ముప్పు తప్పింది. ప్రస్తుతం ముంబైలో వర్షం (Mumbai Rains) తగ్గిపోవడంతో మ్యాచ్ యధాతథంగా జరుగనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అంతే కాకుండా కవర్లు కప్పి ఉంచినా.. తేమ కారణంగా పిచ్ కాస్త తడిగా మారింది. దీంతో వాంఖడే స్టేడియం (Wankhade Stadium) గ్రౌండ్ సిబ్బంది పొడిగా మార్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉదయాన్నే పిచ్‌, మైదానాన్ని పరిశీలించిన మ్యాచ్ అఫీషియల్స్ టాస్‌ను వాయిదా వేశారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు అంపైర్లు  పిచ్‌ను పరిశీలించి మరి కాస్త ఆరాలని సూచించారు. మరోసారి 10.30 గంటలకు  అంపైర్లు పరిశీలించి టాస్ ఎప్పుడు వేస్తారో నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి ఇరు జట్లు వాంఖడేకు చేరుకొని మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి.

  ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తిరిగి వచ్చాడు. టీ20 సిరీస్‌తో పాటు కాన్పూర్ టెస్టుకు కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు అతడు తిరిగి రావడంతో జట్టు బ్యాటింగ్ బలం పెరిగింది. గత రెండేళ్లుగా కోహ్లీ అంతర్జాతీయ సెంచరీ సాధించలేదు. చివరి సారిగా 2019 నవంబర్‌లో కోల్‌కతాతో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. ఇక కోహ్లీకి వాంఖడే స్టేడియం చాలా కలసి వచ్చింది. అరంగేట్రం చేయడమే కాకుండా ఇక్కడ ఒక సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. ఈ మైదానంలో 72.16 సగటు ఉన్నది. దీంతో కోహ్లీ తప్పక రాణిస్తాడని అతడి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కోహ్లీ రాకతో తుది జట్టు నుంచి మయాంక్, పూజార, రహానేలో ఒకరిని తప్పించే అవకాశం ఉన్నది. గత మూడు రోజులుగా వర్షాలు పడుతుండటంతో వాంఖడే పిచ్‌పై తేమ ఎక్కువగా ఉన్నది. అంతే కాకుండా పిచ్ మీద క్రాక్స్ కూడా కనపడుతున్నాయి. టీమ్ ఇండియా ముగ్గురు పేసర్లతో ఆడించే అవకాశం ఉన్నది. అదే జరిగితే ఇషాంత్, ఉమేష్‌లతో పాటు మహ్మద్ సిరాజ్‌ను తీసుకోవచ్చు. ఇద్దరు పేసర్లతో ఆడినా మహ్మద్ సిరాజ్‌కు చాన్స్ వచ్చే అవకాశం ఉన్నది.

  Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ ఈ సారైనా టైటిల్ సాధించేనా? జట్టులో ఉన్నదెవరు? టైటాన్స్ మ్యాచ్ షెడ్యూల్ ఇదే

  న్యూజీలాండ్ జట్టు కాన్పూర్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలం అయినా.. టెయిలెండర్లు అద్బుతంగా పోరాడారు. టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్‌సన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తున్నది. అతనికి టీమ్ ఇండియాపై సరైన రికార్డు కూడా లేదు. అయినా అతడిని కొనసాగించే అవకాశం ఉన్నది. మరోవైపు కైల్ జేమిసన్, టిమ్ సౌథీ ముంబై పిచ్‌పై తప్పకుండా చెలరేగే అవకాశం ఉన్నది. రచిన్ రవీంద్ర బంతితో పెద్దగా రాణించలేదు. అయితే ఆల్‌రౌండర్ కోటాలో కొనసాగించే వీలుంది.

  Peng Shuai Effect: పెంగ్ షుయ్ అదృశ్యం ఎఫెక్ట్.. చైనాలో అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలు నిలిపివేత


  జట్ల అంచనా:

  ఇండియా: శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజార, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, వృద్దిమాన్ సాహ, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ/మహ్మద్ సిరాజ్

  న్యూజీలాండ్ : టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమిసన్, టిమ్ సౌథీ, విలియమ్ సోమర్‌విల్లే, అజాజ్ పటేల్
  Published by:John Kora
  First published:

  Tags: India vs newzealand, Mumbai Rains, Team india

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు