Home /News /sports /

IND VS NZ TEAM INDIA WON THE TOSS AND OPT TO BAT FIRST TEAM INDIA MADE TWO CHANGES IN PLAYING XI JNK

IND vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. కేఎల్ రాహుల్, అశ్విన్ ఔట్.. కిషన్, చాహల్ ఇన్

టాసె గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా (PC: BCCI)

టాసె గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా (PC: BCCI)

IND vs NZ: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా - న్యూజిలాండ్ మధ్య మూడవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

    కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా ఇవాళ ఇండియా (India) - న్యూజీలాండ్ (New Zealand) మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతున్నది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు చివరి మ్యాచ్‌లో రెండు మార్పులు చేసింది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul), స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు (Ravichandran Ashwin)) విశ్రాంతి ఇచ్చి ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్‌కు జట్టులో చోటు కల్పించారు. పిచ్ కాస్త తడిగానే కనిపిస్తున్నది. అయితే ఈ సిరీస్‌లో రెండు సార్లు మేం ఛేజింగ్ చేశాము. అందుకే ఈ సారి బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాము అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రతీ ఒక్కరికి చాన్స్ ఇవ్వాలనే ఇద్దరికి విశ్రాంతిని ఇచ్చామని చెప్పాడు.

    ఇక కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే మేం బౌలింగే చేసేవాళ్లం అన్నాడు. గత రెండు మ్యాచ్‌లలో మంచు తీవ్ర ప్రభావాన్ని చూపింది. అలాగే ఈ మ్యాచ్‌లో కూడా ఆ ప్రభావం ఉ్నది. రెండు మ్యాచ్‌లు ఓడిపోయామనే భావన లేకుండా ఈ మ్యాచ్ ఆడతాము. మా బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. మంచి ఆరంభాలు లభిస్తున్నా.. తర్వాత విఫలం అవుతున్నాం. ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్ల లాగ మేం మంచి భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉన్నది. ఈ మ్యాచ్ గెలిచి టెస్టులకు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తున్నామని అన్నాడు. టిమ్ సౌథీకి విశ్రాంతి కల్పించినట్లు శాంట్నర్ చెప్పాడు. తుది జట్లు ఇలా ఉన్నాయి.

    Rohit Sharma Records: అరంగేట్రం సిరీస్‌లోనే రోహిత్ శర్మ రికార్డులు.. ఆరు రికార్డులతో చెలరేగిన హిట్‌మ్యాన్








    ఈడెన్ గార్డెన్‌లో పిచ్‌పై తేమ ఎక్కువగా కనపడుతున్నది. ఈ మ్యాచ్‌కు మంచు ప్రభావం తీవ్రంగా ఉన్నది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు దీని వల్ల బంతిపై పట్టు చిక్కే అవకాశం ఉండకపోవచ్చు. అయినా సరే రోహిత్ ఒక ప్రయోగం చేయాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. దీని వల్ల మంచు ప్రభావంలో బౌలర్లు ఎలా బంతులు విసురుతారో తెలియడమే కాకుండా.. బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉన్నదో కూడా చూసే అవకాశం కలుగుతుంది.
    Published by:John Kora
    First published:

    Tags: India vs newzealand, Rohit sharma, Team india

    తదుపరి వార్తలు