IND VS NZ TEAM INDIA WON THE TOSS AND ELECTED TO BAT RAHANE ISHANTH JADEJA KANE WILLIAMSON OUT KOHLI SIRAJ JAYANT DARYL MITCHELL IN JNK
INDvsNZ: వావ్.. టాస్ గెలిచిన కోహ్లీ.. బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.. కివీస్‌కు ఎదురు దెబ్బ.. కేన్ విలియమ్స్ ఔట్
ముంబై టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ కోహ్లీ (PC: BCCI)
IND vs NZ: ముంబై వాంఖడే స్టేడియంలో న్యూజీలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముగ్గురు టీమ్ ఇండియా ఆటగాళ్లు గాయాల కారణంగా వైదొలగడంతో.. కోహ్లీ, సిరాజ్, జయంత్ రెండో టెస్టులోకి వచ్చారు. ఇక కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా తప్పుకోవడంతో టామ్ లాథమ్ పగ్గాలు చేపట్టాడు.
ఇండియా - న్యూజీలాండ్ మధ్య కీలకమైన రెండో టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలోప్రారంభం అయ్యింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా వరుసుగా టాస్‌లు ఓడిపోతున్న కోహ్లీ.. కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచాడు. ముంబైలో వర్షాల కారణంగా మైదానం అంతా చిత్తడిగా మారింది. రెండు రోజుల నుంచి కవర్స్ కప్పి ఉంచడంతో తేమ కారణంగా వికెట్ తడిగా ఉన్నది. అందుకే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం చాలా కీలకం కావడంతో కోహ్లీ ఎలాంటి సందేహం లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 'వికెట్ చాలా హార్డ్‌గా ఉన్నది. పైన పెద్దగా గడ్డి కూడా లేదు. రెండు రోజుల తర్వాత సూర్యుడు కూడా బయటకు వచ్చాడు. కాబట్టి బ్యాటింగ్‌కు ఇదే మంచి సమయం. స్వదేశంలో ఆడుతున్నందుకు మేము సానుకూలతలను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము. కాన్పూర్ టెస్టులో కివీస్ బ్యాటింగ్‌కు నిజంగా అభినందనలు తెలపవచ్చు' అని కోహ్లీ అన్నాడు.
గాయాల కారణంగా అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారి స్థానంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్ జట్టు లోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ అరంగేట్రం చేస్తాడని అందరూ భావించారు. కానీ వృద్దిమాన్ సాహ ఫిట్‌గా ఉండటంతో అతడినే కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్ గెలిచి తప్పకుండా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ముందంజ వేయాలని టీమ్ ఇండియా భావిస్తున్నది.
2nd Test. India XI: M Agarwal, S Gill, C Pujara, V Kohli, S Iyer, W Saha, R Ashwin, A Patel, J Yadav, U Yadav, M Siraj https://t.co/CmrJV3PZnh#INDvNZ@Paytm
2nd Test. New Zealand XI: T Latham, W Young, D Mitchell, R Taylor, H Nicholls, T Blundell, R Ravindra, K Jamieson, T Southee, W Somerville, A Patel https://t.co/CmrJV3PZnh#INDvNZ@Paytm
ఇక న్యూజీలాండ్ జట్టుకు మ్యాచ్‌కు ముందు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కేన్ విలియమ్సన్ మోచేతి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో టామ్ లాథమ్‌కు కివీస్ జట్టు పగ్గాలు అప్పగించారు. ఇక కేన్ విలియమ్సన్ స్థానంలో డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు. 'టాస్ గెలిస్తే మేము కూడా బ్యాటింగ్ చేయాలని భావించాము. అయితే కాన్పూర్ టెస్టులో చేసినట్లే ఇక్కడ కూడా మా బౌలర్లు తప్పకుండా రాణిస్తారని అనుకుంటున్నాను. త్వరగా వికెట్లు తీయడం ద్వారా టీమ్ ఇండియాను ఒత్తిడిలో పడేస్తాము. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను ఉపయోగించుకుంటాము' అని కెప్టెన్ లాథమ్ అన్నాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.