టీమ్ ఇండియా (Team India) విజయాల పరంపర కొనసాగుతున్నది. న్యూజీలాండ్‌తో (New Zealand) శుక్రవారం రాత్రి రాంచీలో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజీలాండ్ పెట్టిన 154 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇండియా కేవలం 17.2 ఓవర్లలో ఛేదించింది. మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేఎల్ రాహుల్ మొదటి నుంచే ధాటిగా ఆడాడు. కివీస్ బౌలర్లపై ఎటాకింగ్ క్రికెట్ ఆడి సిక్సులు, బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో అర్ద సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మొదట నెమ్మదిగా ప్రారంభించినా.. తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 5 సిక్సులు బాదాడు. వీరిద్దరూ కలసి మొదటి వికెట్‌కు 117 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరే మ్యాచ్‌ను ఫినిష్ చేస్తారని భావించినా కేఎల్ రాహుల్ (65) టిమ్ సౌథీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దూకుడు మీద ఉన్న రోహిత్ శర్మ (55) టిమ్ సౌథీ బౌలింగ్‌లో మార్టిన్ గప్తిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
తొలి మ్యాచ్ హీరో సూర్యకుమార్ యాదవ్ (1) టిమ్ సౌథీ బౌలింగ్‌లో బౌల్డ్ అయి నిరాశ పరిచాడు. అయితే వెంకటేశ్ అయ్యర్ (12), రిషబ్ పంత్ (12) వికెట్ కోల్పోకుండా మ్యాచ్‌ను గెలిపించాడు. పంత్ ఆఖర్లో వరుసగా రెండు సిక్సులు కొట్టడం విశేషం. దీంతో టీమ్ ఇండియా కేవలం 17.2 ఓవర్లలో 155 పరుగులు చేసింది. భారత జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టిమ్ సౌథీ 3 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. హర్షల్ పటేల్ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. కీలకమైన 2 వికెట్లు తీసి కివీస్ జట్టు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పటేల్ పరుగులు కూడా ఇవ్వకుండా నిలకడగా బౌలింగ్ చేసినందుకు అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో టీమ్ ఇండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్నది.
WHAT. A. WIN! ? ?#TeamIndia secure a 7⃣-wicket victory in the 2nd T20I against New Zealand & take an unassailable lead in the series. ? ? #INDvNZ @Paytm
Scorecard ▶️ https://t.co/9m3WflcL1Y pic.twitter.com/ttqjgFE6mP
— BCCI (@BCCI) November 19, 2021
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్‌కు శుభారంభం లభించింది. మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్ కలసి ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. గుప్తిల్ తొలి బంతి నుంచే చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సులతో బంతిని నలువైపులా పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. ఈ క్రమంలో దూకుడు మీద ఉన్న మార్టిన్ గప్తిల్ (31) దీపక్ చాహర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మార్క్ చాప్మన్ కూడా ధాటిగా ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ కూడా వరుస బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే మార్క్ చాప్మన్ (21) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే డారిల్ మిచెల్ (31) అరంగేట్రం బౌలర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.
6⃣5⃣ Runs
4⃣9⃣ Balls
6⃣ Fours
2⃣ Sixes#TeamIndia vice-captain @klrahul11 set the ball rolling in the chase & scored a fantastic half-century. ? ? #INDvNZ @Paytm
Watch his knock ? ?
— BCCI (@BCCI) November 19, 2021
కివీస్ దూకుడు మీద కనిపించడంతో 200 పరుగులు చేస్తుందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత టీమ్ ఇండియా బౌలర్లు కివీస్ బౌలర్లను కట్టడి చేశారు. టిమ్ సిఫెర్ట్ (13) రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే మరో ఎండ్‌లో గ్లెన్ ఫిలిప్ చెలరేగిపోయాడు. భారీ సిక్సర్లతో కివీస్ స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. కేవలం 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అయితే గ్లెన్ ఫిలిప్స్ (34) హర్షల్ పటేల్ బౌలింగ్‌లో గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పరుగులు రాకుండా జాగ్రత్తగా బంతులు విసిరారు. జేమ్స్ నీషమ్ (3) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత మిచెల్ సాంట్నర్ (8), అడమ్ మిల్నే (5) పరుగులు చేయలేక విఫలం అవడంతో కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ 2 వికెట్లు, భువీ, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs newzealand, KL Rahul, Rahul dravid, Rohit sharma, Team India