హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz : ఉన్నట్టుండి సిరాజ్ నెత్తి మీద లాగి ఒకటి పీకిన రోహిత్ శర్మ.. వైరలవుతున్న వీడియో..

Ind Vs Nz : ఉన్నట్టుండి సిరాజ్ నెత్తి మీద లాగి ఒకటి పీకిన రోహిత్ శర్మ.. వైరలవుతున్న వీడియో..

Ind Vs Nz : విరాట్ కోహ్లి (Virat Kohli) నుంచి టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ (Rohit sharma).. పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు.

Ind Vs Nz : విరాట్ కోహ్లి (Virat Kohli) నుంచి టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ (Rohit sharma).. పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు.

Ind Vs Nz : విరాట్ కోహ్లి (Virat Kohli) నుంచి టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ (Rohit sharma).. పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు.

  టీమిండియా-న్యూజిలాండ్ (India Vs New Zealand) మధ్య జరిగిన తొలి టీ20లో భారత కుర్రాళ్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదికగా న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు ఉండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (Virat Kohli) నుంచి టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ (Rohit sharma).. పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు. ఈ విజయంతో మూడు మ్యాచుల టీ20ల సిరీస్‌లో రోహిత్ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ మ్యాచులో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. టీమిండియా డగౌట్ లో కూర్చున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. హైదరాబాద్ గల్లీబాయ్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నెత్తి మీద లాగి ఒక్కటేశాడు. వెంటనే తేరుకున్న సిరాజ్ చిరునవ్వులు చిందించాడు. అయితే ఇదంతా కెమెరా కంటికి చిక్కడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  ఈ ఫన్నీ వీడియోపై టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. రోహిత్‌పై సిరాజ్ ఏదో సెటైర్ వేసినట్టున్నాడని ఒకరంటే.. మ్యాచ్ గురించి ఏదైనా నెగటీవ్‌గా కామెంట్ చేసినందకు అలా కొట్టాడేమోనని మరికొందరూ కామెంట్ చేస్తున్నారు. భారత్ జట్టు విజయానికి ఆఖరి 6 బంతుల్లో 10 పరుగులు అవసరమవగా.. భారత్ డగౌట్‌లో కాస్త టెన్షన్ వాతావరణం కనిపించింది.

  ఈ దశలో డగౌట్‌లోని టీవీ వైపు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చూస్తుండగా.. వారి పక్కనే కూర్చుని ఉన్న మహ్మద్ సిరాజ్ మాత్రం ఏదో పరధ్యానంలో కనిపించాడు.వీరివైపు టీవీ కెమెరాలు వెళ్లగా.. సిరాజ్ పరధ్యానాన్ని గమనించిన కేఎల్ రాహుల్ నీకు ఏమైంది? అనేలా సిరాజ్‌వైపు చూడగా.. వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ వెనుక వైపు నుంచి సిరాజ్‌కి తన చేతితో ఒకటిచ్చాడు. దాంతో.. సిరాజ్ చిన్నగా నవ్వుతూ కనిపించాడు.

  ఇది కూడా చదవండి :  క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే..

  ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్‌ చాప్‌మన్‌ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు.ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన భారత్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ‌తో ... కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) సూపర్ నాక్‌తో మంచి భాగస్వామ్యాన్ని అందించారు. అయితే మ్యాచ్ చివర్లో వరుస వికెట్ల పడటంతో ఉత్కంఠగా మారింది. అయితే, ఆఖర్లో పంత్ ఓ ఫోర్ బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు.

  First published:

  Tags: Ind vs Nz, India vs newzealand, KL Rahul, Mohammed Siraj, Rohit sharma, Viral Video

  ఉత్తమ కథలు