Ind vs NZ: టీ20 సిరీస్ కూడా భారత్‌దే అంటున్న సునీల్ గవాస్కర్
Ind vs NZ T20 series | ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు...న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ తన జోరు కొనసాగించి విదేశీ గడ్డపై మరోసారి తన సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
news18-telugu
Updated: February 5, 2019, 12:19 PM IST
news18-telugu
Updated: February 5, 2019, 12:19 PM IST
న్యూజిలాండ్ గడ్డపై ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు...టీ20 సిరీస్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా గెలుచుకుని విదేశీ గడ్డపై మరోసారి తన సత్తాను చాటుకోవాలని భారత జట్టు కృతనిశ్చయంతో ఉంది. వెన్నుముక గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో న్యూజిలాండ్ ఓపనర్ మార్టిన్ గప్టిల్ టీ-20 సిరీస్‌కు దూరం కావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి వన్డేకి ముందు గప్టిల్ వెన్నుముకకు గాయం అయ్యింది. దాంతో అతని స్థానంలో ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్‌కు జట్టులో చోటు కల్పించారు. మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ బుధవారం వెల్లింగ్టన్లో జరగనుంది.

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో చివరి రెండు వన్డేలకు నాయకత్వంవహించిన రోహిత్ శర్మ...టీ-20 సిరీస్‌కు కూడా సారథ్యంవహించనున్నాడు. కెప్టెన్‌గా తన సత్తాను నిరూపించుకునేందుకు టీ20 సిరీస్ రోహిత్ శర్మకు మరో చక్కటి అవకాశం.
న్యూజిలాండ్ గడ్డపై మూడు టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుని విదేశీ గడ్డపై కూడా తమకు తిరుగులేదని మరోసారి చాటాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. అయితే కనీసం టీ20 సిరీస్‌ను గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ తహతహలాడుతోంది. టీ20లో రాటుదేలిన భారత్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదన్న విషయం కివీస్ ఆటగాళ్లకు తెలిసిందే. అయితే గత ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే భారత్‌పై కివీస్‌దే పైచేయిగా ఉంది. న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన తొమ్మిది టీ20 మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లలో మాత్రమే భారత జట్టు గెలిచింది. కివీస్ గడ్డపై రెండుసార్లు మాత్రమే భారత జట్టు వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.
అన్ని రంగాల్లో భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్ కంటే బలంగా ఉందని, టీ20 సిరీస్‌ను కూడా భారత్ కైవసం చేసుకుంటుందని భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తంచేశారు. 2-1 తేడాతో భారత జట్టు కివీస్‌ను మట్టికరిపించే అవకాశం ఉందని అంచనావేశారు.
టీ20 సిరీస్ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్లు

టీ20 సిరీస్‌కు సారథ్యంవహించనున్న రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో చివరి రెండు వన్డేలకు నాయకత్వంవహించిన రోహిత్ శర్మ...టీ-20 సిరీస్‌కు కూడా సారథ్యంవహించనున్నాడు. కెప్టెన్‌గా తన సత్తాను నిరూపించుకునేందుకు టీ20 సిరీస్ రోహిత్ శర్మకు మరో చక్కటి అవకాశం.

న్యూజిలాండ్ టీం (File)
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సెన్సార్ టాక్ ఎలా వచ్చిందో తెలుసా..?
Free Bus service: కిడ్నీ పేషెంట్స్‌కి ఫ్రీ బస్ సర్వీస్.. తెలంగాణ ప్రభుత్వ కొత్త నిర్ణయం..
హీరో అవుతున్న జబర్దస్త్ కమెడియన్.. విజయం సాధిస్తాడా..?
రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...
బికినీతో పోజిస్తే...పంది వచ్చి కరిచింది..వీడియో వైరల్
పాక్ ప్రధానికి షాక్... ఇమ్రాన్ ఖాన్ ఫోటోలకు తెరదించిన ఐసీసీ
న్యూజిలాండ్ గడ్డపై మూడు టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుని విదేశీ గడ్డపై కూడా తమకు తిరుగులేదని మరోసారి చాటాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. అయితే కనీసం టీ20 సిరీస్‌ను గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ తహతహలాడుతోంది. టీ20లో రాటుదేలిన భారత్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదన్న విషయం కివీస్ ఆటగాళ్లకు తెలిసిందే. అయితే గత ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే భారత్‌పై కివీస్‌దే పైచేయిగా ఉంది. న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన తొమ్మిది టీ20 మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లలో మాత్రమే భారత జట్టు గెలిచింది. కివీస్ గడ్డపై రెండుసార్లు మాత్రమే భారత జట్టు వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.

సునీల్ గవాస్కర్(ఫైల్ ఫోటో)
Loading....
టీ20 సిరీస్ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్లు
Let the T20Is begin 💪💪#TeamIndia all set to take on the Kiwis for the 1st T20I tomorrow at Westpac Stadium #NZvIND pic.twitter.com/iHzeIL7390
— BCCI (@BCCI) February 5, 2019
Loading...