IND vs NZ: తడబడి నిలిచిన భారత్.. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. తొలి సెషన్ ఇండియాదే.. భారీ స్కోర్ సాధిస్తుందా?

శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. లంచ్ విరామానికి ఇండియా 82/2 (PC: BCCI)

IND vs NZ: కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఓపెనర్లు సరైన ఆరంభం లభించలేదు. మయాంక్ అగర్వాల్ త్వరగా పెవీలియన్ చేరినా.. శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజార జోడి ఇండియాను ఆదుకున్నారు. గిల్ అర్ద సెంచరీతో మెరిసాడు. లంచ్ బ్రేక్‌కి టీమ్ ఇండియా 29 ఓవర్లలో 1 వికెట్ల కోల్పోయి 82 పరుగులు చేసింది.

 • Share this:
  పేటీఎం (PayTm) టెస్టు సిరీస్‌లో (Test Series) భాగంగా తొలి టెస్టు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా ఇండియా - న్యూజీలాండ్ (India vs New Zealand) మధ్య ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాన్పూర్ పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే రహానే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు సరైన ఆరంభం లభించలేదు. రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గైర్హాజరీలో మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ (Shubhman Gil) బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభమైన సమయంలో మంచు ప్రభావం తీవ్రంగా ఉన్నది. కనీసం గ్రౌండ్‌లో బంతి కూడా సరిగా కనపడలేదు. మరియు పిచ్‌ కాస్త తడిగా ఉన్నది. దీన్ని ఆసరాగా తీసుకొని న్యూజీలాండ్ పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. బంతిని స్వింగ్ చేస్తూ టీమ్ ఇండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో గిల్ ఒకసారి సౌథీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఇండియా అనగానే రెచ్చిపోయే కేల్ జేమిసన్ చాలా త్వరగానే కివీస్ జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. కైల్ జేమిసన్ వేసిన 8వ ఓవర్ 5వ బంతికి మయాంక్ అగర్వాల్ (13) టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

  ఇక ఆ తర్వాత శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా కలసి టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తొలుత నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత బౌండరీలు బాదడం మొదలు పెట్టారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ బౌండరీలు బాదాడు. ఒకవైపు పుజార క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తుండానే.. గిల్ పరుగులు రాబడుతూ స్కోర్ పెంచాడు. ఈ క్రమంలో గిల్ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నది. తొలి సెషన్‌లో వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా పరుగులు రాబట్టారు. లంచ్ సమయానికి శుభ్‌మన్ గిల్ (52), చతేశ్వర్ పుజార (15) క్రీజులో ఉన్నారు. టీమ్ ఇండియా 29 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 82 పరుగులు చేసింది. కైల్ జేమిసన్ ఒక వికెట్ తీశాడు. భారత జట్టుకు రెండో సెషన్ కీలకంగా మారనున్నది. ఇదే విధంగా పరుగులు చేస్తే భారత జట్టు భారీ స్కోర్ దిశగా ప్రయాణించవచ్చు.

  Pro Kabaddi League: ప్రో కబడ్డీ లీగ్‌లో ఎన్ని జట్లు ఉన్నయో తెలుసా? వాటి యజమానుల వివరాలు ఇవిగో..


  ఇక టీమ్ ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. టీమ్ ఇండియా తరపున టెస్టు మ్యాచ్ ఆడుతున్న 303వ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. మ్యాచ్‌కు ముందు మైదానంలో జరిగిన టీమ్ మీటింగ్‌లో రాహుల్ ద్రవిడ్ ఆహ్వానం మేరకు దిగ్గజ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అతడికి బ్లూ క్యాప్ అందించి టెస్టు జట్టులోకి ఆహ్వానించాడు. క్యాప్ అందుకున్న తర్వాత శ్రేయస్ చాలా ఉద్వేగంగా కనపడ్డాడు. క్యాప్‌ను ముద్దుపెట్టుకొని తలకు ధరించాడు. అనంతరం జట్టు సభ్యులు అతడికి శుభాకాంక్షలు తెలిపారు.
  Published by:John Kora
  First published: