హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz : " రివ్యూలు ఉండి ఏం ప్రయోజనం.. థర్డ్ అంపైర్ కి ఓ జత కళ్లద్దాలు కొనివ్వండి.. "

Ind Vs Nz : " రివ్యూలు ఉండి ఏం ప్రయోజనం.. థర్డ్ అంపైర్ కి ఓ జత కళ్లద్దాలు కొనివ్వండి.. "

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Ind Vs Nz : ఈ మధ్య కాలంలో రివ్యూలపై మరోసారి గందోరగోళం మొదలైంది. రివ్యూలు తీసుకున్న థర్డ్ అంపైర్ కూడా చేతులేత్తేస్తున్న సందర్భాలు ఇటీవల చాలా పెరిగాయ్.

  ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ (India Vs New Zealand) లో మొదట్లో తడబడ్డ టీమిండియా (Team India) మయాంక్ (Mayank Agarwal) సూపర్ సెంచరీతో పుంజుకుంది. ఒక దశలో 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను తన సూపర్ బ్యాటింగ్ తో ఆదుకున్నాడు యంగ్ ఓపెనర్. మయాంక్ ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ కే నాలుగు వికెట్లు దక్కాయ్. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్ (246 బంతుల్లో 120 పరుగులు.. 14 ఫోర్లు, 4 సిక్సర్లు), వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) (53 బంతుల్లో 25 పరుగులు) ఉన్నారు. ఇక తొలి టెస్టుకు విశ్రాంతి తీసుకొని బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (Virat Kohli) (0) అత్యంత అనుమానాస్పదంగా అవుట్ అయ్యాడు. అజాజ్ పటేల్ వేసిన బంతి కోహ్లీ ప్యాడ్లకు తాకిందని కివీస్ అప్పీల్ చేసింది. దీంతో అంపైర్ అనిల్ చౌదరి అవుట్ ఇచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ రివ్యూ కోరాడు.

  చాలా సేపు థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ ఫుటేజ్ పరిశీలించాడు. అన్ని యాంగిల్స్‌లో వీడియోను గమనించాడు. చూడటానికి బంతి ముందు బ్యాటుకు తగిలినట్లే అనిపించింది. అయితే ఫుటేజీతో అంపైర్ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. దీంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయానికే కట్టుబడి కోహ్లీని అవుట్ ఇచ్చారు. ఇక ఈ నిర్ణయంతో కోహ్లీతో పాటు మైదానంలో ఉన్న అభిమానులు, ఇతర ఆటగాళ్లంతా అవాక్కయ్యారు. కోహ్లీ అయితే అంపైర్‌తో వాదించాడు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఇతర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సైతం ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

  అయితే థర్డ్ అంపైర్ అనూహ్య నిర్ణయంతో అభిమానులు అవాక్కవుతున్నారు. అంత స్పష్టంగా బ్యాట్‌ను తాకి బంతి టర్న్ అయి ప్యాడ్‌ను తాకినట్లు కనిపిస్తుంటే సరైన ఆధారల్లేవని థర్డ్ అంపైర్ చెప్పడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. థర్డ్ అంపైర్ కళ్లు కనబడటం లేదనకుంటా.. ఓ జత కళ్లద్దాలు కొనివ్వండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను చూపించి ఔటిచ్చాడని చెబితే నవ్వుతారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ ఆడలేదు. ఆ టెస్టులో విశ్రాంతి తీసుకున్నాడు. ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ క్రికెట్‌లోని అతిపెద్ద ఫార్మాట్‌కు తిరిగి వచ్చాడు. ఖాతా తెరవకుండానే ఛెతేశ్వర్ పుజారా అవుట్ కావడంతో అతను నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Virat kohli

  ఉత్తమ కథలు