హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz : మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ.. మెరుగైన స్థితిలో టీమిండియా..

Ind Vs Nz : మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ.. మెరుగైన స్థితిలో టీమిండియా..

Mayank Agarwal ( PC : BCCI)

Mayank Agarwal ( PC : BCCI)

Ind Vs Nz : టీమిండియా నయావాల్ పుజారా మరోసారి వైఫల్యం చెందాడు. అతనితో పాటు విరాట్ కోహ్లీ కూడా డకౌట్ గా వెనుదిరిగాడు. ఇద్దరూ స్టార్లు ఫెయిలైనా.. తన క్లాసిక్ బ్యాటింగ్ తో టీమిండియాను ఆదుకున్నాడు మయాంక్ అగర్వాల్.

ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ (India Vs New Zealand) లో మొదట్లో తడబడ్డ టీమిండియా (Team India) మయాంక్ (Mayank Agarwal) సూపర్ సెంచరీతో పుంజుకుంది. ఒక దశలో 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను తన సూపర్ బ్యాటింగ్ తో ఆదుకున్నాడు యంగ్ ఓపెనర్. మయాంక్ ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ కే నాలుగు వికెట్లు దక్కాయ్. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్ (246 బంతుల్లో 120 పరుగులు.. 14 ఫోర్లు, 4 సిక్సర్లు), వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) (53 బంతుల్లో 25 పరుగులు) ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 61 పరుగులు జోడించారు. అంతకుముందు.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(44), మయాంక్ అగర్వాల్ మంచి శుభారంభాన్ని అందించారు. ఆచితూచి ఆడుతూ.. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు.

ఇక హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్‌మన్ గిల్‌ను కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. 44 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్ రాస్ టేలర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా(0), విరాట్ కోహ్లీ (Virat Kohli)(0) ఆజాజ్ పటేల్ తన వరుస ఓవర్లలో డకౌట్ పెవిలియన్ చేర్చాడు. పుజారాను బౌల్డ్ చేసిన పటేల్.. కోహ్లీని వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు.

దీంతో, పటిష్టంగా కనిపించిన భారత్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మయాంక్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో టీమిండియా 111/3 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌(18)ను కూడా ఆజాజ్ పటేల్.. కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో, భారత్ 160 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మయాంక్, సాహా వికెట్లు కోల్పకుండా విలువైన భాగస్వామ్యాన్నినిర్మించారు.

ఇది కూాడా చదవండి :   " KKR సరిగ్గా ఆడకుంటే షారుఖ్ ఖాన్ నన్ను దారుణంగా తిట్టేవాడు " .. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు ..

ఇక, ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పేరిట చెత్త రికార్డు లిఖించుకున్నాడు. క్రికెట్‌లోనే రికార్డుల రారాజుగా పేరొందిన విరాట్.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో, అత్యిధిక సార్లు డకౌట్ అయిన తొలి భారత్ టెస్ట్ కెప్టెన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్టీఫెన్ ఫ్లేమింగ్ టాప్‌లో ఉండగా.. విరాట్ కమ్లీ, గ్రేమ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నారు. స్టీఫెన్ ఫ్లేమింగ్ తన కెరీర్‌లో కెప్టెన్‌గా 13 సార్లు డకౌటయ్యాడు. గ్రేమ్ స్మిత్, విరాట్ కోహ్లీ చెరొక పదిసార్లు సున్నా స్కోర్లకే వెనుదిరిగారు.

First published:

Tags: Cheteswar Pujara, Cricket, Ind vs Nz, India vs newzealand, Virat kohli

ఉత్తమ కథలు