ఆధునిక క్రికెట్ (Cricket) లో బ్యాటర్ల అంతా ఒకవైపు.. విరాట్ కోహ్లి (Virat Kohli) ఒక్కడే ఒక వైపు చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో అతను నెలకొల్పిన రికార్డులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఒకప్పుడు సచిన్(Sachin Tendulkar).. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతలా చెలరేగాడు. తనదైన ఆటతో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు. అలాగే, తన ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు అతను తన అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తే.. మరికొన్నిసార్లు మైదానంలో ఉద్వేగభరితమైన వైఖరితో హాట్ టాపిక్ గా మారుతాడు. ఇక, లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరలవుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయ్. వివరాల్లోకెళితే.. రెండో టెస్ట్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ ఔటైనప్పుడు ఓ అద్భుతమైన రియాక్షన్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 63 వ ఓవర్ లో రచీన్ రవీంద్ర బౌలింగ్ లో వైడ్ బాల్ ను కట్ చేయబోయి వికెట్ సమర్పించుకున్నాడు కోహ్లీ. ఆ తర్వాత నేనా అసలు ఇలా ఔటవ్వడమా అన్నట్టు రియాక్షన్ ఇచ్చాడు కోహ్లీ.
ప్రస్తుతం కోహ్లీ రియాక్షన్ కు సంబంధించిన ఫోటో వైరలవుతోంది. ఇక, రెండో టెస్ట్ (Ind Vs Nz) లో టీమిండియా (Team India) పట్టు సాధించింది. విజయానికి మరింత చేరువైంది కోహ్లీసేన. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. టీమిండియా స్కోరుకి ఇంకా 400 పరుగుల దూరంలో ఉంది న్యూజిలాండ్. టీమిండియా విజయానికి మరో 5 వికెట్లు కావాలి. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (60), విల్ యంగ్ (20) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోలస్ (36), రచిన్ రవీంద్ర (2) లు ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ (Ravi Chandran Ashwin) మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ (Axar Patel) ఒక వికెట్ పడగొట్టాడు. కేఎస్ భరత్ టామ్ బ్లండెల్ ను రనౌట్ చేశాడు.
Reaction of Virat Kohli after getting out for 36.#ViratKohli |#KingKohli pic.twitter.com/DgOo9XLBoI
— VӀRⱭƬ ƘƠӇlӀ Ƒ.Ƈ?? (@kholi_c) December 5, 2021
మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టుకి తొలి బ్రేక్ అందించాడు. 6 పరుగులు చేసిన టామ్ లాథమ్, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 41 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన విల్ యంగ్, అశ్విన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6 పరుగులు చేసిన రాస్ టేలర్, అశ్విన్ బౌలింగ్‌లోనే ఛతేశ్వర్ పూజారాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
Virat Kohli's reaction when he was got out. pic.twitter.com/La8ziwdwIb
— CricketMAN2 (@man4_cricket) December 5, 2021
Sometimes he don't believe on his luck
— Pihu (@Pihu54611668) December 5, 2021
55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కివీస్‌ని డార్ల్ మిచెల్, హెన్రీ నికోలస్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ 18.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, నాలుగో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేసిన డార్ల్ మిచెల్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జయంత్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న భారత జట్టుకి అనుకూలంగా ఫలితం వచ్చింది.ఆ తర్వాత వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ 6 బంతులాడి పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు.
అంతకుముందు, 69/0 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 273/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ (62), పుజారా(47), గిల్ (47), విరాట్ కోహ్లీ(36) లు రాణించారు. ఆఖర్లో అక్షర్ పటేల్ 26 బంతుల్లో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు ఉండటం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అజాజ్.. రెండో ఇన్నింగ్స్ లోనూ నాలుగు వికెట్లు తీశాడు. అతనితో పాటు రచీన్ రవీంద్ర మరో మూడు వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 345 పరుగులు చేయగా.. కివీస్ 62 పరుగులకే ఆలౌట్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, India vs newzealand, VIRAL NEWS, Virat kohli