ముంబై టెస్ట్ (India Vs New Zealand) లో రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా అన్ని రంగాల్లో సత్తా చాటి సంపూర్ణ ఆధిపత్యంలో దూసుకుపోతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 325 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత కివీస్ ను 62 పరుగులకే కట్టడి చేశారు టీమిండియా బౌలర్లు. ఆ తర్వాత ఫాలో - ఆన్ కూడా ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (38), పుజారా (29) లు ఉన్నారు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు గాయం అవ్వడంతో పుజారా ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ప్రస్తుతం టీమిండియాకు 332 పరుగుల భారీ ఆధిక్యం ఉంది. ఇక, అంతకుముందు టీమిండియా న్యూజిలాండ్ కు పగటిపూటే చుక్కలు చూపింది. రెండో రోజు రెండో సెషన్‌లో తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్.. కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయింది.
టీమిండియా బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తో కివీస్ నడ్డివిరిచారు. న్యూజిలాండ్ కు టీమిండియాపై ఇదే అత్యల్ప స్కోరు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ కు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) దుమ్మురేపాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్లు టామ్ లాథమ్ (Tom Latham) (10), విల్ యంగ్ (Will Young) (4)ను పెవిలియన్ చేర్చిన హైదరాబాద్ పేసర్.. ఆ తర్వాత కివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఆ జట్టుకు గట్టి షాకిచ్చాడు.
That's Stumps on Day 2 of the 2nd @Paytm #INDvNZ Test in Mumbai!
A superb show with bat & ball from #TeamIndia! ? ?
We will be back for the Day 3 action tomorrow.
Scorecard ▶️ https://t.co/CmrJV47AeP pic.twitter.com/8BhB6LpZKg
— BCCI (@BCCI) December 4, 2021
ఆ తర్వాత రంగప్రవేశం చేసిన స్పిన్నర్లు కూడా రెచ్చిపోవడంతో న్యూజిలాండ్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది. పరుగులు చేసిన డార్ల్ మిచెల్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా, 31 బంతుల్లో 7 పరుగులు చేసిన హెన్రీ నికోలస్‌ను మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. దీంతో 13.1 ఓవర్లలో 31 పరుగులకే సగం న్యూజిలాండ్ టీమ్ పెవిలియన్ చేరింది. అయితే, టీ విరామానికి ముందే న్యూజిలాండ్ మరో దెబ్బ తీశాడు జయంత్ యాదవ్. రచీన్ రవీంద్ర వికెట్ తీసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రస్తుతం క్రీజు టామ్ బ్లండల్(3) ఉన్నాడు.
టీ విరామం తర్వాత సీనియర్ స్పిన్నర్ రెచ్చిపోయాడు. బ్లండల్, సౌథీ, సోమర్ విల్లేలను స్వల్ప విరామంలో పెవిలియన్ బాట పట్టించాడు అశ్విన్. ఇక, అఖర్లో జేమీసన్ ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. వాంఖడే స్టేడియంలో ఇదే అత్యల్ప స్కోరు.
ఇది కూాడా చదవండి : " నా జీవితంలో చెరిగిపోని మచ్చ " .. ధోనీతో బ్రేకప్ పై రాయ్ లక్ష్మీ సంచలన నిజాలు..
ఇక, అంతకుముందు 221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150) భారీ శతకంతో చెలరేగగా.. చివర్లో అక్షర్ పటేల్(128 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే 10 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. తద్వారా 10 వికెట్ల ఘనతను అందుకున్న మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheteswar Pujara, Ind vs Nz, India vs newzealand, Ravichandran Ashwin, Virat kohli