హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz : మళ్లీ అజాజ్ పటేల్ కే రెండు వికెట్లు.. పటిష్ట స్థితిలో టీమిండియా..

Ind Vs Nz : మళ్లీ అజాజ్ పటేల్ కే రెండు వికెట్లు.. పటిష్ట స్థితిలో టీమిండియా..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Ind Vs Nz : రెండో రోజు ఆటలో పది వికెట్ల తీసి అద్భుతం సృష్టించి అజాజ్‌ పటేల్‌ మూడో రోజు ఆటలో కూడా తొలి వికెట్‌ను తీసుకున్నాడు. అజాజ్‌ బౌలింగ్‌లోనే మయాంక్‌ అవుట్ అయ్యాడు.

ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ (Ind Vws Nz) లో టీమిండియా (Team India) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆటలో లంచ్ విరామానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఓవరాల్ గా 405 పరుగుల లీడ్ లో ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (Virat Kohli) (11), శుభ్ మన్ గిల్ (Shubman Gill) (17) పరుగులతో ఉన్నారు. ఓవర్ నైట్ స్కోరు 69 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో పుజారా (Pujara) కూడా అతనికి మంచి సహాకారాన్ని అందించాడు. అయితే టీమ్ స్కోరు 107 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 62 పరుగుల వద్ద మయాంక్‌ అగర్వాల్‌ విల్‌ యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

రెండో రోజు ఆటలో పది వికెట్ల తీసి అద్భుతం సృష్టించి అజాజ్‌ పటేల్‌ మూడో రోజు ఆటలో కూడా తొలి వికెట్‌ను తీసుకున్నాడు. అజాజ్‌ బౌలింగ్‌లోనే మయాంక్‌ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే 47 పరుగలతో మంచి ఫామ్‌లో ఆడుతోన్న పూజారా కూడా అవుట్‌ అయ్యాడు. అజాజ్‌ పటేల్‌ వేసిన బంతిలో రాజ్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో అజాజ్‌ పటేల్‌ ఈ మ్యాచ్‌లో 12వ వికెట్‌ను తీసుకున్నట్లయింది.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 325 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత కివీస్ ను 62 పరుగులకే కట్టడి చేశారు టీమిండియా బౌలర్లు. రెండో రోజు రెండో సెషన్‌లో తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్.. కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయింది.టీమిండియా బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తో కివీస్ నడ్డివిరిచారు. న్యూజిలాండ్ కు టీమిండియాపై ఇదే అత్యల్ప స్కోరు.

ఇది కూడా చదవండి : గబ్బర్ మనసు దోచిన టీమిండియా మహిళా క్రికెటర్.. త్వరలోనే ఆమెతో పెళ్లి..!

ఇక, అంతకుముందు 221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150) భారీ శతకంతో చెలరేగగా.. చివర్లో అక్షర్ పటేల్(128 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే 10 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. తద్వారా 10 వికెట్ల ఘనతను అందుకున్న మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

First published:

Tags: Cheteswar Pujara, Cricket, Ind vs Nz, India vs newzealand, Virat kohli

ఉత్తమ కథలు