Home /News /sports /

IND VS NZ SECOND TEST LIVE UPDATES TEAM INDIA SETS MASSIVE 540 RUN TARGET AND AJAZ PATEL BAGS 14 WICKETS SRD

Ind Vs Nz : కివీస్ ముందు భారీ టార్గెట్ సెట్ చేసిన టీమిండియా.. అజాజ్ పటేల్ కి 14 వికెట్లు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Ind Vs Nz : తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 50+ స్కోరు నమోదు చేసి... ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక, ఈ టెస్ట్ లో 14 వికెట్లు తీసి చరిత్ర క్రియేట్ చేశాడు అజాజ్ పటేల్.

ఇంకా చదవండి ...
    ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ (India Vs New Zealand) లో టీమిండియా న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. కివీస్ టార్గెట్ 540 పరుగులు. 69/0 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 273/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ (62), పుజారా(47), గిల్ (47), విరాట్ కోహ్లీ(36) లు రాణించారు. ఆఖర్లో అక్షర్ పటేల్ 26 బంతుల్లో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు ఉండటం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అజాజ్.. రెండో ఇన్నింగ్స్ లోనూ నాలుగు వికెట్లు తీశాడు. అతనితో పాటు రచీన్ రవీంద్ర మరో మూడు వికెట్లు పడగొట్టాడు. 108 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను అజాజ్ పటేల్ ను ఫస్ట్ వికెట్ గా పెవిలియన్ కు పంపాడు.

    తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 50+ స్కోరు నమోదు చేసి... ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 1978లో చేతన్ చౌహన్, సునీల్ గవాస్కర్, 1987లో కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ ఫీట్ సాధించారు. 97 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన పూజారా కూడా అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే రాస్ టేలర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.


    తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ రెండు సార్లు గాయపడిన శుబ్‌మన్ గిల్, వన్‌డౌన్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చాడు. శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 75 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 8 బంతుల్లో 2 సిక్సర్లతో 14 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.

    84 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని రచిన్ రవీంద్ర క్లీన్‌బౌల్డ్ చేశాడు... 217 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు. అప్పటికే 480 పరుగుల భారీ ఆధిక్యం ఉన్నా, ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు టీమిండియా. వృద్ధిమాన్ సాహా 12 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు అక్షర్ పటేల్.

    ఇది కూడా చదవండి : గబ్బర్ మనసు దోచిన టీమిండియా మహిళా క్రికెటర్.. త్వరలోనే ఆమెతో పెళ్లి..!

    అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదిన జయంత్ యాదవ్, అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది టీమిండియా. ఆఖర్లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసిన అక్షర్ పటేల్ నాటౌట్‌గా నిలిచాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cheteswar Pujara, Cricket, Ind vs Nz, India vs newzealand, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు