ముంబైలో జరుగుతున్న రెండో టెస్ట్ (India Vs New Zealand) లో టీమిండియా (Team India) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 325 పరుగులకు ఆలౌటైన టీమిండియా న్యూజిలాండ్ కు మాత్రం చుక్కలు చూపుతోంది. రెండో రోజు రెండో సెషన్‌లో తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్, టీ విరామానికి 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) దుమ్మురేపాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్లు టామ్ లాథమ్ (Tom Latham) (10), విల్ యంగ్ (Will Young) (4)ను పెవిలియన్ చేర్చిన హైదరాబాద్ పేసర్.. ఆ తర్వాత కివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఆ జట్టుకు గట్టి షాకిచ్చాడు. ముందుగా విల్ యంగ్‌ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన సిరాజ్.. ఆ తర్వాత టామ్ లాథమ్‌ను షార్ట్ పిచ్ బాల్‌తో బొల్తా కొట్టించాడు. తన మరుసటి ఓవర్‌లో సూపర్ ఇన్ స్వింగ్ డెలవరీతో టేలర్ ఆఫ్ స్టంప్ ఎగరగొట్టాడు. దీంతో 17 పరుగులకే కివీస్ మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ మూడు వికెట్లను సిరాజ్ ప్రణాళిక బద్దంగా బౌలింగ్ చేసి సాధించాడు. అయితే జస్ట్ హ్యాట్రిక్ మిస్ అయ్యాడు.
ఆ తర్వాత రంగప్రవేశం చేసిన స్పిన్నర్లు కూడా రెచ్చిపోవడంతో న్యూజిలాండ్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది. పరుగులు చేసిన డార్ల్ మిచెల్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా, 31 బంతుల్లో 7 పరుగులు చేసిన హెన్రీ నికోలస్‌ను మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. దీంతో 13.1 ఓవర్లలో 31 పరుగులకే సగం న్యూజిలాండ్ టీమ్ పెవిలియన్ చేరింది. అయితే, టీ విరామానికి ముందే న్యూజిలాండ్ మరో దెబ్బ తీశాడు జయంత్ యాదవ్. రచీన్ రవీంద్ర వికెట్ తీసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రస్తుతం క్రీజు టామ్ బ్లండల్(3) ఉన్నాడు.
Jayant Yadav strikes at the stroke of Tea on Day 2 as Rachin Ravindra departs.
New Zealand 38/6 https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/QKvcmzgRRG
— BCCI (@BCCI) December 4, 2021
ఇక, అంతకుముందు 221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150) భారీ శతకంతో చెలరేగగా.. చివర్లో అక్షర్ పటేల్(128 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే 10 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. తద్వారా 10 వికెట్ల ఘనతను అందుకున్న మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
ఇది కూడా చదవండి : " బ్రదర్ కాదు.. బావ అని పిలవాలి " .. కేఎల్ రాహుల్ పై ఫ్యాన్స్ ఫైర్..
కివీస్ బౌలర్ కన్నా ముందే ఈ ఫీట్ ను ఇద్దరూ దిగ్గజ క్రికెటర్లు అందుకున్నారు. ముంబై టెస్ట్ ఫీట్ తో ఆ దిగ్గజాల సరసన చేరాడు అజాజ్ పటేల్. క్రికెట్ చరిత్రలో మొట్ట మొదట ఈ ఫీట్‌ను జిమ్ లేకర్ అందుకున్నాడు. 1956లో ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు సాధించాడు. 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్‌లో 53 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత మరో 43 ఏళ్లకు అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీలో జరిగిన ఆ టెస్ట్ లో దాయాది బ్యాటర్లకు చుక్కలు చూపాడు అనిల్ కుంబ్లే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Mohammed Siraj