న్యూజిలాండ్ తో మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగుతున్న రెండో టి20లో టీమిండియా (Team India) భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. సూర్య శివతాండవంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండటం విశేషం. దీంతో.. అంతర్జాతీయ కెరీర్ లో టి20ల్లో రెండో సెంచరీని నమోదు చేశాడు. అయితే.. ఈ ఇన్నింగ్స్ లో సూర్య బ్యాటింగ్ హైలెట్ కాగా.. మరో అదిరిపోయే రికార్డు కూడా నమోదైంది. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌతీ ఆఖరి ఓవర్ లో హ్యాట్రిక్ తీశాడు. టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఇప్పుడు సౌతీనే అగ్రస్థానంలో ఉన్నాడు. సౌతీ కెరీర్ లో ఇది రెండో హ్యాట్రిక్. టీ20 ఫార్మాట్ లో మలింగ తర్వాత రెండు హ్యాట్రిక్ లు తీసిన బౌలర్ గా సౌతీ రికార్డు క్రియేట్ చేశాడు.
ఇక, హ్యాట్రిక్ విషయానికి వస్తే.. చివరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఒక్క బంతి కూడా ఎదుర్కొనకపోవడం విశేషం. తొలి రెండు బంతులకు హార్దిక్ పాండ్యా 4 పరుగులు సాధించాడు. మూడో బంతికి హార్దిక్ పాండ్యాను.. నాలుగో బంతికి దీపక్ హుడా (0)ను.. ఐదో బంతికి వాషింగ్టన్ సుందర్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆఖరి బంతికి భువీ సింగిల్ తీశాడు.
T20 hat-trick number two for Tim Southee! ???? #NZvIND #CricketNation pic.twitter.com/p17wtD2228
— BLACKCAPS (@BLACKCAPS) November 20, 2022
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు పంత్, ఇషాన్ కిషన్ లు శుభారంభం చేయలేకపోయారు. టి20 ప్రపంచకప్ లో పెద్దగా ప్రభావం చూపని పంత్ ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగాడు. 13 బంతులు ఎదుర్కొన్న అతడు 6 పరుగులు చేశాడు. ఒక ఫోర్ బాదాడు. ఉన్నంత సేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డ అతడు ఫెర్గూసన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించాడు. నియంత్రణ లేని షాట్ వల్ల సౌతీ చేతికి చిక్కి పెవిలియన్ కు చేరాడు.
Bowlers with more than one T20I hat-trick: Lasith Malinga ???????? Tim Southee ???????? A very elite club ????????#NZvIND pic.twitter.com/OrQXXAvjZa
— Wisden (@WisdenCricket) November 20, 2022
వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. 20 నిమిషాల తర్వాత మ్యాచ్ ఆరంభం కాగా సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ కు అంతర్జాతీయ టి20ల్లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇంగ్లండ్ పై ఈ ఏడాది తొలి సెంచరీని సాధించాడు.
ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్ లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్లో ఏకంగా 4 ఫోర్లతో పాటు ఒక భారీ సిక్సర్ బాది మొత్తంగా 22 పరుగులు సాధించాడు. గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడటం విశేషం. కీపర్ తల మీదుగా సూర్యకుమార్ యాదవ్ కొట్టిన సిక్సర్లు అద్భుతం అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భారత్ 191 పరుగులు సాధిస్తే అందులో ఒక్క సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి వచ్చినవే 111 పరుగులు కావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hardik Pandya, Ind vs Nz, India vs newzealand, Surya Kumar Yadav