హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz : సిరాజ్ ఔట్.. ఆ యంగ్ ప్లేయర్ కు లక్కీ ఛాన్స్.. రెండో టీ-20కి భారత తుది జట్టు ఇదే..!

Ind Vs Nz : సిరాజ్ ఔట్.. ఆ యంగ్ ప్లేయర్ కు లక్కీ ఛాన్స్.. రెండో టీ-20కి భారత తుది జట్టు ఇదే..!

Ind Vs Nz

Ind Vs Nz

Ind Vs Nz : మరో మ్యాచ్ మిగిలుండగా టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటోందా..? న్యూజిలాండ్ ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ను సమం చేస్తోందా..?

టీ20 ప్రపంచకప్ లో ఎదురైన పరాభావానికి లెక్క సరి చేసింది టీమిండియా. భారత్-న్యూజిలాండ్ (India Vs New Zealand) మధ్య జరిగిన తొలి టీ20లో భారత కుర్రాళ్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదికగా న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు ఉండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (Virat Kohli) నుంచి టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ (Rohit sharma).. పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు. ఈ విక్టరీతో మూడు మ్యాచుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది రోహిత్ సేన. ఇక ఇప్పుడు అదే ఊపుతో రెండో టీ-20 పోరుకు రెడీ అయింది. రాంచీ వేదికగా శుక్రవారం జరగనున్న రెండో టీ20 లో సౌథీ సేనతో ఢీ కొట్టనుంది టీమిండియా. ఈ మ్యాచ్ లో విక్టరీ కొట్టి రాంచీలోనే సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు ఫస్ట్ టీ20లో ఆఖరి ఓవర్‌ వరకు పోరాడిన న్యూజిలాండ్.. రెండో టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్ రేసులో నిలవాలనుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్‌పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక రెండో టీ20కి జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. విన్నింగ్ కాంబినేషన్‌నే రోహిత్-ద్రవిడ్ ద్వయం కొనసాగించే అవకాశం ఉంది. అయితే టెస్ట్ సిరీస్ ను దృష్టిలో పెట్టుకుని.. ఫస్ట్ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడిన మహమ్మద్ సిరాజ్‌కు తదుపరి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తూ సిరాజ్ గాయపడిన విషయం తెలిసిందే. అదే జరిగితే ఆవేశ్ ఖాన్ లేదా హర్షల్ పటేల్ జట్టులోకి రావడం ఖాయం.

ఇక, ఈ మ్యాచులో కూడా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. రాహుల్ విఫలమైనప్పటికీ రోహిత్ చెలరేగాడు. సెకండ్ మ్యాచ్‌లోనైనా రాహుల్ రాణించాలి. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తాడు. తొలి మ్యాచ్‌లో కోహ్లీ లేని లోటును పూడ్చుతూ సూర్య చెలరేగాడు. తనదైన షాట్లతో న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. హాఫ్ సెంచరీతో జట్టులో కీలక పాత్ర పోషించాడు. నాలుగో స్థానంలో రిషభ్ పంత్ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదు, ఆరో స్థానల్లో శ్రేయస్, వెంకటేశ్ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు కూడా తమ సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

వెంకటేశ్ అయ్యర్‌తో పాటు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండర్లు బరిలోకి దిగనున్నారు. వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్ చేయకపోయిప్పటికీ బ్యాటింగ్‌లో బౌండరీ కొట్టాడు. ఆ వెంటనే ఔటయ్యాడు. అయితే అతను కొట్టిన బౌండరీ టీమ్ ప్రెజర్‌ను తగ్గించింది. అక్షర్ పటేల్, అశ్విన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో అక్షర్ విఫలమైనప్పటికీ.. అశ్విన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండు కీలక వికెట్లు తీశాడు. అక్షర్ విఫలమైనా అతనికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ సామర్థ్యం అతనికి ఉన్న ప్రధాన బలం.

ఇది కూడా చదవండి :  ఫస్ట్ టీ-20 మ్యాచ్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ చేసిన పెద్ద తప్పు ఇదే..! తీవ్ర అసంతృప్తిలో ఫ్యాన్స్..

తొలి మ్యాచ్‌లో ఆశ్చర్యకరంగా భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్‌లు బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ ఒకే తరహా బౌలింగ్ శైలి అయినప్పటికీ టీమ్‌మేనేజ్‌మెంట్ ఇద్దర్ని ఆడించింది. రెండు వికెట్లతో పాత భువనేశ్వర్‌ను తలపించగా.. దీపక్ చాహర్ ఓ వికెట్‌‌తో పర్వాలేదనిపించాడు.

టీమిండియా తుది జట్టు అంచనా :

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్/ హర్షల్ పటేల్

First published:

Tags: Ind vs Nz, India vs newzealand, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India

ఉత్తమ కథలు