టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. హామిల్టన్ లో వర్షం ఆగిపోయింది. దీంతో.. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఇక, మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు అంపైర్లు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగే సమయానికి టీమిండియా 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో శుభ్ మన్ గిల్ (21 బంతుల్లో 19 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు), శిఖర్ ధావన్ (8 బంతుల్లో 2 పరుగులు నాటౌట్ ) ఉన్నారు. అయితే. .మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగానే.. మూడు పరుగులు చేసిన శిఖర్ ధావన్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. మ్యాట్ హెన్రీ గబ్బర్ వికెట్ తీశాడు. ఇక, ఓవర్లు కుదించడంతో టీమిండియా బ్యాటర్లు ధనాధన్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మనోళ్లు సత్తా చాటి.. భారీగా పరుగులు చేస్తేనే కివీస్ ముందు భారీ టార్గెట్ సెట్ చేయవచ్చు.
GAME ON!#SparkSport #NZvIND pic.twitter.com/8wmvS0mPr6
— Spark Sport (@sparknzsport) November 27, 2022
ఫస్ట్ మ్యాచులో 306 పరుగుల భారీ టార్గెట్ ను కూడా కాపాడుకోలేక చేతులేత్తేసిన టీమిండియాకు రెండో వన్డే చావోరేవో లాంటిది. ఈ మ్యాచులో గెలిస్తే టీమిండియా కచ్చితంగా సిరీస్ లో నిలుస్తుంది లేకపోతే.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక, హామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్ జట్టు. ఇక, టీమిండియా ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. శార్దూల్ ఠాకూర్, సంజూ శాంసన్ ల్ని పక్కనపెట్టి.. దీపక్ చాహర్, దీపక్ హుడాలకు ఛాన్స్ ఇచ్చింది. ఇక.. న్యూజిలాండ్ ఆడమ్ మిల్నే స్థానంలో మైకేల్ బ్రేస్ వేల్ ను జట్టులోకి తీసుకుంది.
టీమిండియాలో శుభ్ మన్ గిల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ మంచి టచ్ లో ఉన్నారు. అయితే, రిషబ్ పంత్ రాణించాల్సిన అవసరముంది. ఇక, బౌలింగ్ లో దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్ కీలకం కానున్నారు. మరోవైపు.. న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, డేవాన్ కాన్వే డేంజరస్ ప్లేయర్లు. బౌలింగ్ లో లూకీ ఫెర్గ్యూసన్, టిమ్ సౌతీ మంచి ఫామ్ లో ఉన్నారు.
తుది జట్లు :
శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, మైకేల్ బ్రెస్ వేల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లూకీ ఫెర్గ్యూసన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Kane Williamson, Shikhar Dhawan