హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ : టాస్ గెలిచిన కేన్ మామ.. సంజూ శాంసన్ పై వేటు.. టీమిండియా తుది జట్టు ఇదే..

IND vs NZ : టాస్ గెలిచిన కేన్ మామ.. సంజూ శాంసన్ పై వేటు.. టీమిండియా తుది జట్టు ఇదే..

PC : TWITTER

PC : TWITTER

IND vs NZ : ఈ మ్యాచులో గెలిస్తే టీమిండియా కచ్చితంగా సిరీస్ లో నిలుస్తుంది లేకపోతే.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మూడు వన్డేల సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో డూ ఆర్ డై ఫైట్ కు రెడీ అయింది.. ఫస్ట్ మ్యాచులో 306 పరుగుల భారీ టార్గెట్ ను కూడా కాపాడుకోలేక చేతులేత్తేసిన టీమిండియాకు రెండో వన్డే చావోరేవో లాంటిది. ఈ మ్యాచులో గెలిస్తే టీమిండియా కచ్చితంగా సిరీస్ లో నిలుస్తుంది లేకపోతే.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక, హామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్ జట్టు. ఇక, టీమిండియా ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. శార్దూల్ ఠాకూర్, సంజూ శాంసన్ ల్ని పక్కనపెట్టి.. దీపక్ చాహర్, దీపక్ హుడాలకు ఛాన్స్ ఇచ్చింది. ఇక.. న్యూజిలాండ్ ఆడమ్ మిల్నే స్థానంలో మైకేల్ బ్రేస్ వేల్ ను జట్టులోకి తీసుకుంది.

ఈ మ్యాచ్ సిరీస్ ఫలితంతో పాటు.. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్లపైనా ప్రభావం పడనుంది. ఈ మ్యాచులో టీమిండియా గెలిస్తే సిరీస్ రేసులో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం సిరీస్ కోల్పోవడంతో పాటు.. సూపర్ లీగ్ లో రెండో స్థానానికి పడిపోయే ప్రమాదముంది.ప్రస్తుతం భారత్ 19 మ్యాచుల్లో 13 విజయాలు.. 6 ఓటములతో 129 పాయింట్లు సాధించి మొదటి స్ధానంలో ఉంది. కివీస్ 16 మ్యాచుల్లో 12 విజయాలు.. 4 ఓటములతో 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో.. టీమిండియా తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీమిండియాలో శుభ్ మన్ గిల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ మంచి టచ్ లో ఉన్నారు. అయితే, రిషబ్ పంత్ రాణించాల్సిన అవసరముంది. ఇక, బౌలింగ్ లో దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్ కీలకం కానున్నారు. మరోవైపు.. న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, డేవాన్ కాన్వే డేంజరస్ ప్లేయర్లు. బౌలింగ్ లో లూకీ ఫెర్గ్యూసన్, టిమ్ సౌతీ మంచి ఫామ్ లో ఉన్నారు.

తుది జట్లు :

టీమిండియా : శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్

న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, మైకేల్ బ్రెస్ వేల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లూకీ ఫెర్గ్యూసన్

First published:

Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Kane Williamson, Rishabh Pant, Sanju Samson, Shikhar Dhawan

ఉత్తమ కథలు