హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ : బ్యాడ్ న్యూస్.. వర్షంతో మ్యాచ్ రద్దు.. టీమిండియాకు భారీ నష్టం..!

IND vs NZ : బ్యాడ్ న్యూస్.. వర్షంతో మ్యాచ్ రద్దు.. టీమిండియాకు భారీ నష్టం..!

PC : BCCI

PC : BCCI

IND vs NZ : టీమిండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. అనుకున్నదే జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీమిండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. న్యూజిల్యాండ్‌, భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. తొలి వన్డేల భారీ స్కోరు చేసినా ఓటమిపాలైన టీమిండియా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని అనుకుంది. అయితే ఆ ఆశలకు వరుణుడు గండి కొట్టాడు. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ కు దిగింది. 4.5 ఓవర్లలో భారత జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం పెద్దది అవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. అయితే.. కేవలం 12.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

12.5 ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ (42 బంతుల్లో 45 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు, 1 సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 34 పరుగులు ; 2 ఫోర్లు, 3 సిక్సర్లు నాటౌట్) కాసేపు మెరుపులు మెరిపించారు. అయితే, ధావన్ మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. మ్యాట్ హెన్రీకి ఒక వికెట్ దక్కింది.

మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన చాలా మంది ప్రేక్షకులు నిరాశగా ఇంటి దారి పట్టారు. అంతకుముందు టాస్ సమయంలో కూడా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆలస్యంగా టాస్ వేశారు. టాస్ నెగ్గిన కేన్ విలియమ్సన్ తాము ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక, టీమిండియా ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. శార్దూల్ ఠాకూర్, సంజూ శాంసన్ ల్ని పక్కనపెట్టి.. దీపక్ చాహర్, దీపక్ హుడాలకు ఛాన్స్ ఇచ్చింది. ఇక.. న్యూజిలాండ్ ఆడమ్ మిల్నే స్థానంలో మైకేల్ బ్రేస్ వేల్ ను జట్టులోకి తీసుకుంది.

అయితే, ఈ మ్యాచ్ రద్దవ్వడంతో టీమిండియాకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఫస్ట్ మ్యాచు కోల్పోయిన టీమిండియా 1-0తో సిరీస్ లో వెనుకంజలో ఉంది. దీంతో.. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని భావించింది. అయితే, ఇప్పుడు మ్యాచ్ రద్దవ్వడంతో టీమిండియా సిరీస్ గెలిచే ఛాన్సు కోల్పోయింది. ఇక, మూడో వన్డే ఈ నెల 30 న జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సమయం చేయాలని గబ్బర్ సేన భావిస్తుంది.

తుది జట్లు :

శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్

న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, మైకేల్ బ్రెస్ వేల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లూకీ ఫెర్గ్యూసన్

First published:

Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Shikhar Dhawan, Shreyas Iyer, Surya Kumar Yadav

ఉత్తమ కథలు