Home /News /sports /

Ind Vs Nz : తెలుగు తేజం భరత్ కు గోల్డెన్ ఛాన్స్.. రెండో టెస్ట్ లో బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే..!

Ind Vs Nz : తెలుగు తేజం భరత్ కు గోల్డెన్ ఛాన్స్.. రెండో టెస్ట్ లో బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే..!

Team India

Team India

Ind Vs Nz : రెస్ట్ కారణంగా తొలి టెస్ట్‌కు దూరమైన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. విరాట్ కోహ్లీ రాకతో తుది జట్టు కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  టీమిండియా - కివీస్ ల (Ind Vs Nz Test Series) మధ్య ఉత్కంఠగా జరిగిన తొలి టెస్ట్ ఫలితం తేలకుండానే ముగిసిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతి వరకు భారత్‌ (Team India) ను ఊరించిన విజయం తృటిలో చేజారింది. ఇక, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (World Test Champion Ship) లో భాగంగా తొలి టెస్టు డ్రా అయిన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఆఖరి వరకు ఊరించి విజయం దూరమైనా.. ముంబై టెస్టులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచిస్తోంది. కాగా.. భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్ట్‌ డిసెంబర్‌ 3 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. రెస్ట్ కారణంగా తొలి టెస్ట్‌కు దూరమైన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. విరాట్ కోహ్లీ రాకతో తుది జట్టు కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుసగా విఫలమవుతున్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane)పై వేటు వేస్తారా? లేక మరో అవకాశం ఇస్తారా? అనేది చూడాలి.

  వరుసగా విఫలమవుతున్న అజింక్యా రహానేనే పక్కన పెట్టే అవకాశం ఉంది. మంచి ప్రదర్శన కనబర్చిన శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేస్తే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతాయి. కాబట్టి రహానేనే పక్కనపెట్టేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ సాహిసించవచ్చు. ఒక వేళ అతనికి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై వేటు పడే చాన్సుంది. అప్పుడు కోహ్లీ లేదా పుజారా.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. మయాంక్ అగర్వాల్ సైతం ఫస్ట్ టెస్ట్‌లో దారుణంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ రెగ్యూలర్ ఓపెనర్‌గా మారడంతో మయాంక్ చాలా రోజుల నుంచి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ సిరీస్‌లో వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు.

  మెల్ బోర్న్ టెస్ట్ సెంచరీ తర్వాత రహానే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లోనూ 35, 4 మెప్పించలేకపోయాడు. మరోవైపు కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ, హాఫ్ సెంచరీ‌తో ఆకట్టుకున్నాడు. దాంతో కోహ్లీ కోసం ఎవరిని పక్కనపెట్టాలనేది టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది.

  మయాంక్‌కు అవకాశమిస్తే మాత్రం రహానేపైనే వేటు పడుతుంది. అప్పుడు పుజారా, కోహ్లీ మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నారు. ఇక ఫస్ట్ టెస్ట్‌లో మెడనొప్పికి గురైన వృద్దిమాన్ సాహా ఈ మ్యాచుకి అందుబాటులో ఉండే అవకాశం లేదు. మరోవైపు అతని స్థానంలో కీపింగ్ చేసిన యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ దుమ్మురేపాడు. సూపర్ కీపింగ్‌తో ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సాహా ఫిట్‌గా లేకుంటే శ్రీకర్ భరత్ అరంగేట్రం చేయడం ఖాయం. అదే జరిగితే అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ వస్తాడు.

  ఇది కూడా చదవండి :  అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 8 కోట్లు.. తన స్టామినా ఏంటో చూపిన యంగ్ ప్లేయర్..

  ఇక స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ మరోసారి కీలకం కానున్నారు. ఫస్ట్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఈ ఆల్‌రౌండ్ త్రయం.. సెకండ్ టెస్ట్‌లో కూడా చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. మైదానంలో పరిస్థితులను బట్టి జడేజా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేయవచ్చు. లోయరార్డర్‌లో అశ్విన్, అక్షర్ పటేల్ కీలకం కానున్నారు.

  ఇది కూడా చదవండి : రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వదిలేయడానికి డబ్బే కారణమా? అసలు విషయం చెప్పిన రషీద్ మేనేజర్..

  ఇక రెండో టీ20లో చేతి వేలి గాయానికి గురైన మహమ్మద్ సిరాజ్ జట్టులోకి రావచ్చు. అదే జరిగితే ఇషాంత్ శర్మపై వేటు పడుతుంది. ఫస్ట్ టెస్ట్‌లో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ పెద్దగా రాణించలేదు. ఉమేశ్ రెండు వికెట్లు తీసినా.. ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

  టీమిండియా తుది జట్టు అంచనా :

  శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్/అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎస్ భరత్/వృద్దిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Mohammed Siraj, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు