కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజీలాండ్‌తో (New Zealand) జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు టీమ్ ఇండియా (Team India) కష్టాల్లో పడింది. తొలి సెషన్‌లో 82/1 స్కోరుతో పటిష్టంగా కనపడిన భారత్.. రెండో సెషన్‌లో కీలకమైన వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం తర్వాత బ్యాటింగ్ తిరిగి ప్రారంభించిన టీమ్ ఇండియా కీలకమైన శుభ్‌మన్ గిల్ (Shubhman Gil) వికెట్ కోల్పోయింది. తొలి సెషన్‌లో హాఫ్ సెంచరీ (52) చేసిన గిల్ పరుగులేమీ జత చేయకుండానే కైల్ జేమిసన్ (Kyle Jamieson) బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. జేమిసన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. తొలి సెషన్‌లో మయాంక్ అగర్వాల్ (Mayank Agarwar) వికెట్ తీసిన జేమిసన్.. రెండో సెషన్ ప్రారంభంలోనే కీలకమైన గిల్ వికెట్ తీసి ఇండియాను ఇరకాటంలో పెట్టాడు. ఇక ఆ తర్వాత చతేశ్వర్ పుజార, అజింక్య రహానే కలసి ఇన్నింగ్స్ నిర్మించడానికి ప్రయత్నించారు. ఇద్దరూ చాలా ఆచితూచి ఆడటంతో పెద్దగా పరుగులేమీ రాలేదు.
పుజార మొదటి నుంచి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించడంతో న్యూజీలాండ్ బౌలర్లు మొదటి అతడిని టార్గెట్ చేశారు. స్పిన్నర్లు బౌలింగ్ చక్కగా వేస్తున్నా.. వికెట్లు తీయలేక పోతుండటంతో కేన్ విలియమ్‌సన్ సౌథీకి బంతి అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చతేశ్వర్ పుజార (26) వికెట్ తీశాడు. దీంతో భారత జట్టు 106 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అజింక్య రహానేకు అరంగేట్రం బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జతకలిశాడు. ఇద్దరూ ధీటుగా కివీస్ బౌలర్లను ఎదుర్కున్నారు. పరుగులు వస్తుండటంతో భారత జట్టు స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. నాలుగో వికెట్‌కు 39 పరుగులు జోడించిన తర్వాత వీరి జోడి విడిపోయింది. అజింక్య రహానే (35) కైల్ జేమిసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత రవీంద్ర జడేజాకు ప్రమోషన్ లభించి ముందుగానే బ్యాటింగ్‌కు దిగాడు. వీరిద్దరూ వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. టీ విరామ సమయానికి భారత జట్టు 56 ఓవర్లలో 154/4 స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్ 17, రవీంద్ర జడేజా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సెషన్‌లో కివీస్ మూడు వికెట్లు తీసి ఆధిపత్యం ప్రదర్శించింది.
That will be Tea on Day 1 of the 1st Test.#TeamIndia lose three wickets in the second session.
Scorecard - https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/SygJbWpp6n
— BCCI (@BCCI) November 25, 2021
ఇక ఇప్పుడ మూడో సెషన్‌లో భారమంతా శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజాపైనే ఉన్నది. వీరిద్దరూ ఎంత సేపు క్రీజులో ఉండి పరుగలు చేస్తే.. ఇండియాకు అంత మేలు జరుగుతుంది. ఇక అంతకు ముందు తొలి సెషన్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. న్యూజీలాండ్ పేసర్లు పిచ్ పరిస్థిని ఉపయోగించుకుని మంచి స్వింగ్ బౌలింగ్ చేశారు. దీంతో మయాంక్ అగర్వాల్ (13) త్వరగా అవుటయ్యాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (52), చతేశ్వర్ పుజార కలసి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ క్రీజులో పాతుకొని పోయి భారత్‌కు పరుగులు రాబట్టారు. ముఖ్యంగా గిల్ అద్బుతంగా బ్యాటింగ్ చేసి అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామానికి భారత్ 82/1 వద్ద ఉన్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheteswar Pujara, India vs newzealand, Rahul dravid, Ravindra Jadeja, Shreyas Iyer, Team India, Test Cricket