టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 ముగిసింది. టోర్నీ మొత్తం నిలకడగా ఆడిన ఇంగ్లండ్ (England) ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan)ను ఓడించి రెండోసారి టి20 ప్రపంచకప్ చాంపియన్ గా నిలిచింది. టోర్నీ ఫేవరెట్స్ లో ఒకటిగా ఉన్న టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఇక భారత్ న్యూజిలాండ్ తో సిరీస్ కు సిద్ధమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul) లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. దాంతో టి20లకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. వన్డేలకు శిఖర్ ధావన్ సారథిగా ఉంటాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తో భారత్ మూడు టి20లు.. మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ ఈ నెల 18న ఆరంభం కానుంది
ఈ నెల 18న జరిగే తొలి టి20తో సిరీస్ ఆరంభం కానుంది. ఆ తర్వాత నవంబర్ 20, 22న రెండు టి20లు జరగనున్నాయి. ఇక నవంబర్ 25న తొలి వన్డే జరగనుంది. 27న రెండో వన్డే.. 30న మూడో వన్డే జరగనుంది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను చాంపియన్ గా నిలబెట్టిన తర్వాత హార్దిక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రెండో సిరీస్ ఇదే. అంతకుందు ఐర్లాండ్ తో సిరీస్ లో కూడా హార్దిక్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో జరిగే సిరీస్ లో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.
ఇక, టీమిండియాతో సిరీస్ కోసం.. న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. టీ20, వన్డే జట్లను ప్రకటించింది. అయితే, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ల్ మార్టిన్ గప్టిన్, ట్రెంట్ బౌల్ట్ లకు ఈ జట్టుల్లో చోటు దక్కలేదు. ఇక, ట్రెంట్ బౌల్ట్ ఈ ఆగస్ట్ లో న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో.. అతన్ని జట్టు ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోలేదు. ఇక, మార్టిన్ గప్టిన్ టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఎంపికైనా ఒక మ్యాచు కూడా ఆడలేదు. కేన్ మామ రెండు జట్లకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
యంగ్ సంచలనం ఫిన్ అలెన్ ను రెండు స్క్వాడ్ ల్లోకి తీసుకున్నారు. ఫాస్ట్ బౌలర్ అడమ్ మిల్నే వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక, మూడో వన్డేకు జేమ్స్ నీషమ్ అందుబాటులో ఉండడు. నీషమ్.. తన పెళ్లి కోసం ఈ మ్యాచు నుంచి తప్పుకున్నాడు. హెన్రీ నికోలస్.. నీషమ్ స్థానంలో మూడో వన్డేకి అందుబాటులో ఉండనున్నాడు.
Our squads to face India in three T20I's & three ODI's starting on Friday at @skystadium ????
Details | https://t.co/OTHyEBgKxQ#NZvIND pic.twitter.com/2Ov3WgRJJt — BLACKCAPS (@BLACKCAPS) November 14, 2022
న్యూజిలాండ్ బలగం :
వన్డే జట్టు : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్ వెల్, డేవాన్ కాన్వే, లోకి ఫెర్గ్యూసన్, డారిల్ మిచెల్, అడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ.
టీ20 జట్టు : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్ వెల్, డేవాన్ కాన్వే, లోకి ఫెర్గ్యూసన్, డారిల్ మిచెల్, అడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోథీ, బ్లెయిన్ టిక్నర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hardik Pandya, Ind vs Nz, India vs newzealand, Kane Williamson, Shikhar Dhawan