IND VS NZ MAYANK AGARWAL SAYS THIS SUNIL GAVASKAR ADVICE HELPED HIM SCORE CENTURY JNK
IND vs NZ: మయాంక్ అగర్వాల్ సెంచరీ వెనుక ఉన్న స్టోరీ తెలుసా? మ్యాచ్‌కు ముందు పలుమార్లు ఆ వీడియో చూశాడంటా..!
మయాంక్ అగర్వాల్ సెంచరీ వెనుక ఉన్న స్టోరీ ఇదే.. (PC: BCCI)
Mayank Agarwal: టీమ్ ఇండియా ఓపెనర్ ముంబైలో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు సెంచరీ సాధించాడు. మిడిల్ ఆర్డర్ మొత్తం పూర్తిగా విఫలమయైన సమయంలో తీవ్ర ఒత్తిడిలో మయాంక్ సెంచరీ బాదాడు. అతడు సెంచరీ వెనుక ఉన్న కథను మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత వెల్లడించాడు.
టీమ్ ఇండియా (Team India) మిడిలార్డర్ అజాజ్ పటేల్ (Ajaj Patel) ధాటికి కుప్పకూలిన సమయంలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) చాలా ఓపికగా ఆడాడు. తీవ్రమైన ఒత్తిడిని జయించి మరీ అద్భుతమైన సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్ (120) భారత జట్టు పటిష్ట స్థితిలో ఉండటానికి ప్రధాన కారకుడయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు మయాంక్ అగర్వాల్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. అసలు తుది జట్టులో స్థానం దక్కుతుందో లేదో తెలియదు. కాన్పూర్ టెస్టులో (Kanpur Test) రెండు ఇన్నింగ్స్ కలిపి చేసింది కేవలం 30 పరుగులే. అదే సమయంలో కేఎల్ రాహుల్ (KL Rahul), రోహిత్ శర్మ (Rohit Sharma) వస్తే తన స్థానం ఏంటో కూడా తెలియని సందిగ్ద పరిస్థితి. ఒకవైపు ఫామ్ లేమి.. మరోవైపు జట్టులో స్థానం ఊగిసలాగలా ఉన్నది. ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో 80 పరుగుల మీదే 3 వికెట్లు పడ్డాయి. సెంచరీ వీరుడు శ్రేయస్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలా నిలకడగా.. ఒత్తిడిని జయించి అగర్వాల్ అద్భుత సెంచరీ చేశాడు.
అతడి టెక్నిక్‌లో లోపాలు ఉన్నట్లు చాలా మంది సీనియర్లు, మాజీ క్రికెటర్లు అతడికి సలహా ఇచ్చాడు. దాన్ని సరి చేసుకోవడానికి మ్యాచ్‌కు ముందు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వీడియోలు చూశానని మయాంక్ చెప్పాడు. గవాస్కర్ వీడియోలు చూసిన తర్వాతే తన బ్యాటింగ్ పద్దతిని కొద్దిగా మార్చినట్లు చెప్పాడు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత మయాంక్ మాట్లాడుతూ.. నేను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి ఎంపిక అయినట్లు తెలవగానే రాహుల్ ద్రవిడ్ దగ్గరకు వెళ్లాను. ఆయన నాతో మాట్లాడాడు. నువ్వు నీ చేతుల్లో ఏదైతో ఉన్నదో అది చెయ్యి. నీ కంట్రోల్లో ఉండేది నీ బ్యాటింగ్ మాత్రమే. దాట్లో బెస్ట్‌ను ఇవ్వ అని చెప్పాడు. నేను మైదానంలోకి వెళ్లిన తర్వాత సరైన ఆరంభం లభించాలని అనుకున్నాను. నాకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాను. రాహుల్ భాయ్ ఇచ్చిన సలహాను మరుపురానిదిగా మార్చాలని నేను అనుకున్నాను. అలాగే చేశానని మయాంక్ అగర్వాల్ చెప్పాడు.
What does it mean to score a ton in whites? 🤔@mayankcricket expresses his run of emotions to @prasidh43 after his gritty century on Day 1 of the 2nd @Paytm#INDvNZ Test at Wankhede. 😎 😎 - By @28anand
ఇక గవాస్కర్ తన వ్యాఖ్యానంలో నేను బ్యాటింగ్ చేసే సమయంలో బ్యాక్ లిఫ్ట్ తగ్గించాలని అన్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో నా బ్యాటును తక్కువ ఎత్తులో ఉంచాలని అన్నాడు. నేను మరీ ఇంత తక్కువ సమయంలో ఆ స్టాండ్‌ను మార్చలేను. కానీ గవాస్కర్ వీడియోలు చూసిన తర్వాత భుజం ఎలా ఉందో గమనించి అలా బ్యాక్ లిఫ్ట్‌ను తగ్గించే ప్రయత్నం చేశానని మయాంక్ అన్నాడు. ఇక ఇంగ్లాండ్‌లో ఆకపోవడం చాలా బాధకరమని చెప్పాడు. నెట్ సెషన్ సమయంలో తలకు గాయమైంది. కంకషన్ కారణంగా నేను టెస్టు మ్యాచ్‌లు ఆడలేకపోయాను. దీంతో ఆ తర్వాత మరింత కష్టపడి జట్టులోకి తిరిగి వచ్చాను అని మయాంక్ చెప్పాడు. రెండవ రోజు భారత ఇన్నింగ్స్ మొత్తం మయాంక్ అగర్వాల్, వృద్దిమాన్ సాహపైనే ఆధారపడి ఉన్నది. వీళ్లిద్దరూ సాధ్యమైనంత ఎక్కువ సమయం క్రీజులో ఉండాలి. అప్పుడే భారత జట్టు 300పై గా పరుగులు చేసే అవకాశం ఉంటుంది.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.