భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో మరోసారి చివరి ఓవర్ ఉత్కంఠ భరితంగా సాగింది. అత్యంత రసవత్తరంగా సాగిన మ్యాచ్ మళ్లీ టై అయింది. చివరి ఓవర్‌కు న్యూజిలాండ్ గెవలవడానికి 7 పరుగులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో చివరి ఓవర్ శార్థూల్ ఠాకూర్ వేశాడు. ఆరు పరుగులు ఇచ్చాడు. మూడు వికెట్లు తీశాడు.
శార్థూల్ వేసిన చివరి ఓవర్ మొదటి బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్‌కు తరలించేందుకు రాస్ టేలర్ ప్రయత్నించాడు. అయితే, శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో అతడు వెనుదిరిగాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ ఫోర్ కొట్టాడు. మూడో బాల్‌కు మిచెల్ డాట్ బాల్ ఆడాడు. అయితే, రన్ కోసం ప్రయత్నించడంతో వెంటనే కీపర్ రాహుల్ బాల్‌ను వికెట్ల మీదకు విసిరాడు. దీంతో సీఫెర్ట్ రనౌట్ అయ్యాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.