హోమ్ /వార్తలు /క్రీడలు /

Azaz Patel: ఒక్కడే 10 వికెట్లు తీశాడు.. భారత్‌పై చరిత్ర సృష్టించిన కివీస్ బౌలర్ అజాజ్ పటేల్

Azaz Patel: ఒక్కడే 10 వికెట్లు తీశాడు.. భారత్‌పై చరిత్ర సృష్టించిన కివీస్ బౌలర్ అజాజ్ పటేల్

అజాల్ పటేల్

అజాల్ పటేల్

Azaz Patel: తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 47.5 ఓవర్లు వేశాడు అజాజ్ పటేల్. కేవలం 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి.

న్యూజిలాండ్ (Newzealand) స్పిన్నర్ అజాజ్ పటేల్ (Azaz Patel) చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు మొత్తం 10 వికెట్లను అతనొక్కడే పడగొట్టాడు. వాంఖడే గ్రౌండ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్‌ చేశాడు. ఈ ప్రదర్శనతో టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అజాజ్. ఇంతకు ముందు భారత బౌలర్ అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ మాత్రమే ఈ ఘనత సాధించారు. క్రికెట్ చరిత్రలో మొట్ట మొదట ఈ ఫీట్‌ను జిమ్ లేకర్ అందుకున్నాడు. 1956లో ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత 1999లో పాకిస్తాన్‌పై అనిల్ కుంబ్లే 10 వికెట్లను పడగొట్టాడు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఆ ఘనతను సాధించిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు అజాజ్ పటేల్.

తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 47.5 ఓవర్లు వేశాడు అజాజ్ పటేల్. కేవలం 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. భారత్ గడ్డపై ఓ విదేశీ స్పిన్నర్‌కి ఇవే అత్యుత్తుమ గణాంకాలు. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్న అజాజ్‌ను భారత్ మాజీ బౌలర్ అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, రవిశాస్త్రి, హర్భజన్ సింగ్, అరోన్ ఫించ్‌తో పాటు పలువురు క్రికెటర్లు అభినందించారు.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 325 పరుగులకు ఆలౌటయింది. మయాంక్‌ అగర్వాల్‌ (150; 311 బంతుల్లో 17x4, 4x6), అక్షర్‌ పటేల్‌ (52; 128 బంతుల్లో 5x4, 1x6) రాణించారు. శుభమాన్ గిల్ 44 పరుగులు, వృద్దిమాన్ సాహా 27 పరుగులతో పరవాలేదనిపించారు. స్టార్ బ్యాట్స్‌మెన్ పుజారా, విరాట్ కొహ్లీ డకౌట్ అయ్యారు.

First published:

Tags: Cricket, Ind vs Nz, India, Newzealand, Sports