Home /News /sports /

IND vs NZ: కోహ్లీ ఫేట్ మారుతుందా? సెంచరీ చేయక 741 రోజులు.. వాంఖడేలో కోహ్లీకి అద్భుత రికార్డు

IND vs NZ: కోహ్లీ ఫేట్ మారుతుందా? సెంచరీ చేయక 741 రోజులు.. వాంఖడేలో కోహ్లీకి అద్భుత రికార్డు

కలిసొచ్చిన గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడా?

కలిసొచ్చిన గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడా?

IND vs NZ: టీమ్ ఇండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేయక 700 రోజులు దాటిపోయింది. ముంబైలో జరిగే రెండో టెస్టులో తప్పకుండా సెంచరీ కొడతాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ స్టేడియంలో కోహ్లీకి మంచి రికార్డు ఉండటమే కారణం.

ఇంకా చదవండి ...
    కాన్పూర్‌లో న్యూజీలాండ్ (New Zealand) - ఇండియా (India) మధ్య తొలి టెస్టు ఉత్కంఠతతో కూడిన డ్రాగా ముగిసింది. ఇక సిరీస్ డిసైడర్ అయిన రెండో టెస్టు శుక్రవారం నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానున్నది. భారత జట్టు (Team India) ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) తుది జట్టులోకి వస్తుండటంతో ఎవరిని జట్టు నుంచి తొలగిస్తారు? ఇక రెండో ది ఈ మ్యాచ్‌లో అయినా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా? ఈ రెండు విషయాలపై ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఈ మ్యాచ్‌లో తమ అభిమాన క్రికెట్ సెంచరీ బాదుతాడని ధీమాగా చెబుతున్నారు. దాదాపు నెల రోజుల తర్వాత కోహ్లీ తిరిగి మైదానంలో కనపడనున్నాడు.

    టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న మరో పేరు 'రన్ మెషిన్'. అతడికి ఆ పేరు రావడంలో ఏ మాత్రం తప్పులేదు. ఇప్పటి వరకు విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 70 సెంచరీలు బాదాడు. అయితే కోహ్లీ సెంచరీ చేసి రెండేళ్లకు పైగా అయ్యింది. 23 నవంబర్ 2019న బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్‌లో చివరి సారిగా సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత కోహ్లీ ఫామ్‌లో లేడా అంటే అదీ కారణం కాదు. కోహ్లీ ఆ సెంచరీ తర్వాత డజన్ల కొద్దీ అర్ద సెంచరీలు బాదాడు. కానీ వాటిని సెంచరీలుగా మార్చడంలో విఫలమయ్యాడు. ఈ సారి ఎలాగైనా కోహ్లీ సెంచరీ కొట్టాలని అతడి ఫ్యాన్సే కాదు.. క్రికెట్ ప్రేమికులు అందరూ ఎదురు చూస్తున్నారు.

    Ind Vs Nz : తెలుగు తేజం భరత్ కు గోల్డెన్ ఛాన్స్.. రెండో టెస్ట్ లో బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే..!



    విరాట్ కోహ్లీ సెంచరీ నిరీక్షణ ముంబైలో తీరుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వాంఖడే స్టేడియం కోహ్లీకి చాలా కలసి వచ్చింది. ఇక్కడ ఇప్పటి వరకు కోహ్లీ 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 72.17 సగటుతో మొత్తం 433 పరుగులు చేశాడు. ఈ స్టేడియంలో ఆరు ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు మూడు అర్ద సెంచరీలు కూడా సాధించాడు. విరాట్ కోహ్లీ ఇదే వాంఖడేలో 2016లో ఇంగ్లాండ్‌పై 235 పరుగులు చేశాడు. కోహ్లీ టెస్టుల్లో అరంగేట్రం చేసింది కూడా ఇక్కడే. ఇక వెస్టిండీస్‌తో జరగిన టెస్టుల్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు.


    విరాట్ కోహ్లీ రెండేళ్ల నుంచి రికీ పాంటింగ్‌ రికార్డును సమం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సచిన్ టెండుల్కర్ చేశాడు. అతడి పేరు మీద 100 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత స్థానంలో రికీ పాంటింగ్ 71 సెంచరీలతో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 70 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఒక్క సెంచరీ చేస్తే రికీ పాంటింగ్ సెంచరీల రికార్డును సమం చేస్తాడు. ఈ మ్యాచ్‌లో ఈ కోరికలన్నింటినీ కోహ్లీ తీరుస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
    Published by:John Kora
    First published:

    Tags: India vs newzealand, Rahul dravid, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు