అందరూ ఊహించినట్టుగానే జరిగింది. టీమిండియా (Team India) టీ20 క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయి నాయకత్వ మార్పిడి జరిగింది. టీమిండియా టి20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) ను నియమిస్తున్నట్లు బీసీసీఐ (BCCI) ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021లో పేలవ ప్రదర్శనతో సూపర్ 12 దశ నుంచే ఇంటిదారిపట్టిన టీమిండియా.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 17 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. కివీస్ సిరీస్ కోసం బీసీసీఐ 16 సభ్యుల జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో.. జట్టు పగ్గాలను బీసీసీఐ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు అందించింది. యువ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు అందుకోనున్నాడు.
మూడు టీ20 మ్యాచ్‌లలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 17న జైపుర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ కు మైదానంలో అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జైపుర్ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. టిక్కెట్టు ధర రూ. 1000 నుంచి రూ. 15,000 వరకు ఉండనుంది.
అయితే, కనీసం కరోనా టీకా తొలి డోసు తీసుకున్నవారినే జైపూర్ మైదానంలోకి అనుమతించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర క్రికెట్ నిర్వహణ కమిటీ తెలిపింది. అలాగే, ప్రతిఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మాస్కులు, శానిటేషన్, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్.
ఇది కూాడా చదవండి : మలాలా పెళ్లి చేసుకున్న అస్సర్ మాలిక్ ఎవరు? క్రికెట్ తో అతనికి ఉన్న లింకేంటి..?
ఇక, భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్ (నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ (నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్‌కతా (నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. ఆపై ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్‌లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది. అలాగే, టెస్ట్ సిరీస్ కూడా కోహ్లి అందుబాటులో ఉండటంలేదని.. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ రెండు టెస్టులకు టీమిండియాకు నేతృత్వం వహిస్తాడని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs newzealand, Rohit sharma, Team India, Virat kohli