హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz : జట్టులో విరాట్ కోహ్లీ పాత్రపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. అందరి దృష్టి ఆ ఇద్దరిపైనే..!

Ind Vs Nz : జట్టులో విరాట్ కోహ్లీ పాత్రపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. అందరి దృష్టి ఆ ఇద్దరిపైనే..!

Kohli - Rohit

Kohli - Rohit

Ind Vs Nz : ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌రువాత టీమిండియా (Team Inda)లో చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ త‌ప్పుకోగా.. కోచ్ బాధ్య‌త‌ల నుంచి ర‌విశాస్త్రీ ప‌ద‌వీ కాలం ముగిసింది.

టీ20 ప్రపంచకప్‌ 2021 తో విసిగిపోయిన క్రికెట్ లవర్స్ (Cricket Fans) కోసం మ‌రో సిరీస్ సిద్ధ‌మైంది. నవంబర్ 17, 2021 నుంచి న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌ తో అమీతుమీ తేల్చుకోనుంది. యూఏఈలో టీ20 ప్రపంచకప్ ఆడిన కివీస్ నేరుగా భారత్‌కు వచ్చేసింది. టీమ్ ఇండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌రువాత టీమిండియా (Team Inda)లో చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ త‌ప్పుకోగా.. కోచ్ బాధ్య‌త‌ల నుంచి ర‌విశాస్త్రీ ప‌ద‌వీ కాలం ముగిసింది. ఈ నేప‌థ్యంలో కొత్త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma), కోచ్ ద్రావిడ్ సార‌థ్యంలో బ‌ల‌మైన న్యూజిలాండ్ (NewZealand) జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో రాహుల్ ద్రవిడ్‌, రోహిత్ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ... " మా జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిదిద్దుకోవడమే మా ముందున్న అతిపెద్ద సవాల్. ఈ క్రమంలో ఇతర జట్ల వ్యూహాలను మేం అనుసరించం. మాకు ఏది సరిపోతుందో ఆ మార్గాన్నే ఎంచుకుంటాం. ప్రతి ఆటగాడు మాకు ముఖ్యమే. అందుకే వారిపై పని భారం పడకుండా చూస్తాం. మా జట్టులో విరాట్ కోహ్లీ కీలక ఆటగాడు. జట్టు అవసరాలను బట్టి అతడి సేవలను ఉపయోగించుకుంటాం. జట్టులోని ఒకరిద్దరిపైనే ఆధారపడితే విజయాలు సాధించలేం. అందుకే జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను మలుచుకుంటాం. ప్రతి ఒక్కరు భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేలా చూస్తా. మీరు బాగా ఆడినా, ఆడకపోయినా మీకు అండగా మేమున్నామనే భరోసా కల్పిస్తాం." అంటూ వ్యాఖ్యానించాడు.

టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్‌ మాట్లాడుతూ... " జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా రాణించాలంటే ప్రతి ఒక్క ఆటగాడు తాజాగా ఉండటం చాలా ముఖ్యం. కీలక ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరికేలా చూస్తా. ఒకే ఆటగాడు అన్ని ఫార్మాట్లలో రాణించడం చాలా కష్టం. అందుకే జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్లను తయారు చేసుకుంటాం మాకు అన్ని ఫార్మాట్లు ముఖ్యమే. భవిష్యత్తులో జరుగనున్న ఐసీసీ టోర్నమెంట్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టాం. అన్ని విభాగాల్లో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తాం. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను తయారు చేసే ఆలోచన ఇప్పుడు లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం. " అని చెప్పారు.

ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ.. ఇండియా-ఏ, అండర్-19 కోచ్‌గా తనదైన ముద్ర వేసిన రాహుల్ ద్రవిడ్ కాంబినేషన్‌లో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు ప్రారంభించనుంది. దీంతో, ఈ ఇద్దరిపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ ద్వయం ఏ మేరకు అంచనాల్ని అందుకుంటారో వేచి చూడాలి. అయితే, సొంతగడ్డపై జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మంచు కీలకంగా మారనుంది.

ఇది కూడా చదవండి : గ్రీన్ కలర్ బికినీలో అనుష్క శర్మ .. భార్య ఫోటోలకు విరాట్ కోహ్లీ రొమాంటిక్ కామెంట్..

తొలి మ్యాచ్‌కు వేదికైన పింక్ సిటీ జైపూర్‌లో ఇప్పటికే రాత్రి వేళలో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. దీంతో ఈ సిరీస్‌లోనూ టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఫస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండటంతో.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ) కూడా టీమిండియా విజయం కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాచ్ టైమ్‌లో మంచు ప్రభావం తగ్గించేందుకు కెమికల్స్‌ను స్ప్రే చేయాలని డిసైడ్ అయ్యింది.

First published:

Tags: Cricket, India vs newzealand, Rahul dravid, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు