హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz : ఆరంభం అదిరింది.. ఉత్కంఠ పోరులో టీమిండియా సూపర్ విక్టరీ..

Ind Vs Nz : ఆరంభం అదిరింది.. ఉత్కంఠ పోరులో టీమిండియా సూపర్ విక్టరీ..

Team India (BCCI)

Team India (BCCI)

Ind Vs Nz : ఫస్ట్ లో అదరొగొట్టిన టీమిండియా బ్యాటర్లు చివర్లో తడబడ్డారు. కానీ చివరికి విక్టరీ కొట్టి సిరీస్ లో ఆధిక్యంలో దూసుకెళ్లారు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ-20 మ్యాచులో టీమిండియా విక్టరీ కొట్టింది. ఫస్ట్ లో అదరగొట్టిన టీమిండియా బ్యాటర్లు ఆఖర్లో టెన్షన్ పెట్టించారు. 3 బంతుల్లో మూడు పరుగులు అవసరమైన సమయంలో పంత్ బౌండరీ బాదడంతో విజయాన్ని దక్కించుకుంది టీమిండియా. దీంతో మూడు టీ-20 మ్యాచుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది రోహిత్ సేన. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 62 పరుగులు..ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) , రోహిత్ శర్మ ( 36 బంతుల్లో 48 పరుగులు.. 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఇక, రెండో టీ-20 ఈ నెల 19న రాంచీలో జరగనుంది.165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు నిలకడైన ఆరంభం లభించింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీమిండియాకు మంచి స్టార్ట్ అందించారు. ఓ వైపు రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతుంటే.. కేఎల్ రాహుల్ వికెట్లు కాపాడాడు.

ఓపెనర్లరిద్దరూ ఫస్ట్ వికెట్ కు 50 పరుగుల పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. అయితే, 15 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో మార్క్‌ చాప్‌మన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రోహిత్ జతగా చేరిన సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన శైలిలో రెచ్చిపోయాడు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్ చెత్త బంతుల్ని బౌండరీలు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకుకెళ్లారు. దీంతో.. 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 104 పరుగులు చేసింది. అయితే, హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్‌ శర్మ(48) బౌల్ట్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది.

దీంతో 59 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ శర్మ ఔటైనా.. తనదైన శైలిలో చెలరేగాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు ఈ స్టైలిష్ బ్యాటర్. అయితే, 62 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ ను బౌల్ట్ బౌల్డ్ చేయడంతో 144 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అయితే, ఆఖర్లో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తమ బ్యాటింగ్ తో టెన్షన్ పెట్టారు. ఆఖరి ఓవర్ లో పది పరుగులు చేయాల్సిన స్థితికి తీసుకువచ్చారు. 8 బంతుల్లో 5 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో ఔటై నిరాశపర్చాడు యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెంకటేశ్ అయ్యర్ తన ఫస్ట్ బంతికే బౌండరీ తరలించాడు. అయితే, ఆ వెంటనే రివర్స్ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు.

అంతకు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసి.. టీమిండియా ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (70; 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు), స్టార్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ (63; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలు బాదారు. టీ20 ప్రపంచకప్ 2021లో మెరిసిన డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

టాస్‌ నెగ్గిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుని కివీస్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. అయితే న్యూజిల్యాండ్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ (0)ను భువనేశ్వర్‌ కుమార్ క్లీన్‌ బౌల్డ్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్‌ చాప్‌మన్‌ (63)తో కలిసి మరో ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (70) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఒకవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. మరోవైపు చెత్త బంతులను బౌండరీలకు పంపారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. వీరిద్దరూ కలిసి శతక (109) భాగస్వామ్యం నిర్మించారు.

ప్రమాదకరంగా మారుతున్న సమయంలో మార్క్ చాప్‌మన్‌ను స్పిన్నర్ ఆర్ అశ్విన్ అవుట్ చేశాడు. ఆ వెంటనే గ్లెన్ ఫిలిప్స్ (0)ను కూడా యాష్ పెవిలియన్ చేర్చాడు. ఆపై భారీ సిక్సులతో చెలరేగుతున్న మార్టిన్‌ గప్తిల్‌ను దీపక్ చహర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే టిమ్ సేఫెర్ట్ (12)ను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. దాంతో కివీస్ స్కోర్ బోర్డుకు బ్రేకులు పడ్డాయి. రచిన్ రవీంద్ర (7)ను మొహ్మద్ సిరాజ్‌ బౌల్డ్ చేశాడు. చివరకు మిచెల్ సాంట్నర్ (4), టీమ్ సౌథీ (0)లు క్రీజులో ఉన్నారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ 164/6 స్కోరు చేసింది. భారత బౌలర్లలో ఆర్ అశ్విన్‌ 2, భువనేశ్వర్‌ కుమార్ 2.. దీపక్ చహర్, మొహ్మద్ సిరాజ్‌ చెరో వికెట్‌ తీశారు. రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా, రోహిత్ శర్మ సారథ్యంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో భారత్ సిరీస్‌ వేటను ప్రారంభించింది.

First published:

Tags: India vs newzealand, KL Rahul, Rahul dravid, Rishabh Pant, Rohit sharma

ఉత్తమ కథలు