టీ20 ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగి కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన భారత జట్టు సొంతగడ్డపై మరో ఆసక్తికరపోరుకు సిద్ధమైంది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్‌తో సరికొత్తగా కనిపిస్తున్న జట్టు.. 2022 టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే ఫస్ట్ టీ20లో వరల్డ్ కప్ ఫైనలిస్ట్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇక, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ మారడంతో లక్క్ కలిసి వచ్చినట్టు ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ ఎంతో ప్రభావం చేయనుంది. ఇక, ఈ మ్యాచ్ లో వెంకటేశ్ అయ్యర్ అరంగేట్రం చేయనున్నాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ లు తిరిగి జట్టులోకి చేరారు.
ఈ సిరీస్‌తోనే కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ శకం మొదలవుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి పోరులోనే గెలిచి సిరీస్ పట్టు సాధించాలని భావిస్తున్న రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తొంది. కోహ్లీ సహా పలువురు సీనియర్ల గైర్హాజరీలో చాన్నాళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడుతున్న ఈ సిరీస్ ఫలితం భారత్‌కు కీలకం.
Toss Update from Jaipur:@ImRo45 has won the toss & #TeamIndia have elected bowl against New Zealand in the first T20I. @Paytm #INDvNZ
Follow the match ▶️ https://t.co/5lDM57TI6f pic.twitter.com/Xm3p91BgLG
— BCCI (@BCCI) November 17, 2021
ఇక, న్యూజిలాండ్ కూడా కొత్త కెప్టెన్ టీమ్ సౌథీ నేతృత్వంలో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతోంది. కేన్ విలియమ్సన్, కైల్ జెమీసన్ వంటి స్టార్ ప్లేయర్లు ఈ సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఆ జట్టులో మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సైఫర్ట్ వంటి హిట్టర్లు ఉన్నారు. గాయం నుంచి కోలుకున్న ఐపీఎల్ స్టార్ లూకీ ఫెర్గ్యూసన్ తిరిగి జట్టులో చేరాడు.
A look at #TeamIndia's Playing XI for the first T20I ?
Follow the match ▶️ https://t.co/5lDM57TI6f #INDvNZ @Paytm pic.twitter.com/VgcQG9B0mH
— BCCI (@BCCI) November 17, 2021
తుది జట్లు:
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్ మాన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సైఫర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ(కెప్టెన్), టాడ్ అస్టల్, లూకీ ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Rohit sharma