హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz : ఫైటింగ్ టోటల్ సెట్ చేసిన న్యూజిలాండ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

Ind Vs Nz : ఫైటింగ్ టోటల్ సెట్ చేసిన న్యూజిలాండ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

Ind Vs Nz series

Ind Vs Nz series

Ind Vs Nz : ఈ సిరీస్‌తోనే కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ శకం మొదలవుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి పోరులోనే గెలిచి సిరీస్‌ పట్టు సాధించాలని భావిస్తున్న రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తొంది.

ఇంకా చదవండి ...

జైపూర్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టీ-20 మ్యాచులో న్యూజిలాండ్ ఫైటింగ్ టార్గెట్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ ( 42 బంతుల్లో 70 పరుగులు... 3 ఫోర్లు, 4 సిక్సర్లు), మార్క్ చాప్ మన్ ( 50 బంతుల్లో 63 పరుగులు.. 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తో రాణించారు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కూడా రెండు వికెట్లతో మెరిశాడు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ భువనేశ్వర్‌ బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మార్టిన్ గప్టిన్ తో చేరిన మార్క్ చాప్ మన్ ఫస్ట్ ఆరు ఓవర్లు ఆచి తూచి ఆడాడు. దీంతో, ఆరు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

ఈ క్రమంలో మార్క్ చాప్ మన్ తొలి హాఫ్ సెంచరీ బాదాడు. అయితే, దూకుడు మీదున్న న్యూజిలాండ్ కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్రేకులు వేశాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ దెబ్బకు న్యూజిలాండ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో రెండో బంతికి చాప్‌మన్‌(63) ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు అశ్విన్. దీంతో, 109 పరుగుల విలువైన పార్టనర్ షిష్ కు బ్రేకు పడింది.

ఆ తర్వాత ఐదో బంతికి గ్లెన్‌ ఫిలిప్స్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. దీంతో, 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది న్యూజిలాండ్. మరో ఎండ్ లో ఉన్న మార్టిన్ గప్టిల్ కూడా తన హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. సిరాజ్ బౌలింగ్ లో ఓ భారీ సిక్సర్ తో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. టీమిండియాపై మార్టిన్ గప్టిల్ కి ఇదే తొలి హాఫ్ సెంచరీ.

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మార్టిన్ గప్టిన్ వరుస షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే, దూకుడు మీదున్న మార్టిన్ గప్టిల్ (70) ను దీపక్ చాహర్ పెవిలియన్ పంపాడు. దీపక్ చాహర్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు మార్టిన్ గప్టిల్. అయితే డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో న్యూజిలాండ్ ఈ టోటల్ సాధించింది. లేకపోతే టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని సెట్ చేసి ఉండేది.

తుది జట్లు:

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్ మాన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సైఫర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ(కెప్టెన్), టాడ్ అస్టల్, లూకీ ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్

First published:

Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Ravichandran Ashwin, Rohit sharma, Team India

ఉత్తమ కథలు