టీ20 ప్రపంచకప్ 2021 తో విసిగిపోయిన క్రికెట్ లవర్స్ (Cricket Fans) కోసం మరో సిరీస్ సిద్ధమైంది. నవంబర్ 17, 2021 నుంచి న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ తో అమీతుమీ తేల్చుకోనుంది. యూఏఈలో టీ20 ప్రపంచకప్ ఆడిన కివీస్ నేరుగా భారత్‌కు వచ్చేసింది. టీమ్ ఇండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తరువాత టీమిండియా (Team Inda)లో చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోగా.. కోచ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రీ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), కోచ్ ద్రావిడ్ సారథ్యంలో బలమైన న్యూజిలాండ్ (NewZealand) జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారని క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ.. ఇండియా-ఏ, అండర్-19 కోచ్‌గా తనదైన ముద్ర వేసిన రాహుల్ ద్రవిడ్ కాంబినేషన్లో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు ప్రారంభించనుంది. ఈ సుదీర్ఘ ప్రయాణానికి రేపటి మ్యాచ్‌తో తెరలేవనుంది. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొలంది.
అయితే, సొంతగడ్డపై జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మంచు కీలకంగా మారనుంది. తొలి మ్యాచ్‌కు వేదికైన పింక్ సిటీ జైపూర్‌లో ఇప్పటికే రాత్రి వేళలో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. దీంతో ఈ సిరీస్‌లోనూ టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఫస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండటంతో.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) కూడా టీమిండియా విజయం కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాచ్ టైమ్‌లో మంచు ప్రభావం తగ్గించేందుకు కెమికల్స్‌ను స్ప్రే చేయాలని డిసైడ్ అయ్యింది.
ఈ మ్యాచ్‌కు మంచుతో పాటు గాలి కాలుష్యం ముప్పు కూడా కనిపిస్తోంది. ఢిల్లీ మాదిరిగా జైపూర్‌లో కూడా గాలి కాలుష్యం లెవల్స్ పెరిగాయి. సిటీలో ఆదివారం ఉదయం విపరీతమైన పొగ కమ్ముకుంది. గత వారం రోజులుగా పింక్ సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337 పాయింట్లుగా నమోదవుతున్నది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే తామున్నది క్రికెట్ ఆడటానికే అని భారత వైస్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ అంటున్నాడు. పొల్యూషన్ అంత తీవ్రంగా ఏమీ లేక పోవచ్చని అభిప్రాయపడ్డాడు.
ఇది కూడా చదవండి : తొలి టీ20 మ్యాచ్ జరగడం కష్టమేనా..? ఆ విషయంలో భయపడుతున్న ఆటగాళ్లు..!
టీ20 వరల్డ్ కప్ 2021 లో మ్యాచ్ ఫలితాన్ని టాస్ శాసించడం ఫ్యాన్స్‌ను అసహనానికి గురి చేసింది. అయితే భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో పరుగుల వరద పారనుంది. జైపూర్‌లో బుధవారం తొలి టీ20 కోసం సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో పిచ్ సిద్ధమవుతోంది. భారీ స్కోర్లు ఖాయమని పిచ్ క్యూరేటర్ చెబుతున్నారు. మరోవైపు కొత్త హెడ్ కోచ్ ద్రావిడ్ పర్యవేక్షణలో సోమవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. టీ20 నయా సారథి రోహిత్ శర్మ నెట్స్‌లో భారీ షాట్లు కొడుతూ కనిపించాడు. మిగతా ప్లేయర్లు కూడా వామప్స్తో పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేశారు. దీంతో, అందరి దృష్టి రోహిత్ శర్మ, ద్రావిడ్ కాంబినేషన్ పై పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Rahul dravid, Rohit sharma