హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz Second Test : అసలు రెండో టెస్ట్ జరుగుతుందా..? ఆ కారణంగా రెండు జట్ల ప్రాక్టీస్ సెషన్ రద్దు..

Ind Vs Nz Second Test : అసలు రెండో టెస్ట్ జరుగుతుందా..? ఆ కారణంగా రెండు జట్ల ప్రాక్టీస్ సెషన్ రద్దు..

Team India

Team India

Ind Vs Nz Second Test : భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్ట్‌ డిసెంబర్‌ 3 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ టెస్ట్ పై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయ్.

  టీమిండియా - కివీస్ ల (Ind Vs Nz Test Series) మధ్య ఉత్కంఠగా జరిగిన తొలి టెస్ట్ ఫలితం తేలకుండానే ముగిసిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతి వరకు భారత్‌ (Team India) ను ఊరించిన విజయం తృటిలో చేజారింది. ఇక, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (World Test Champion Ship) లో భాగంగా తొలి టెస్టు డ్రా అయిన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఆఖరి వరకు ఊరించి విజయం దూరమైనా.. ముంబై టెస్టులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచిస్తోంది. కాగా.. భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్ట్‌ డిసెంబర్‌ 3 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే, భారత్ ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయ్. రెండో టెస్ట్ అసలు జరుగుతుందో లేదో అన్న డౌట్ మొదలైంది. కాగా.. భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్ట్‌ డిసెంబర్‌ 3 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎందుకంటే ముంబైలో బుధవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో భారత్, న్యూజిలాండ్ జట్లు తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకోవలసి వచ్చింది. వర్షం కారణంగా వాంఖడే స్టేడియం పిచ్ తడిసి ముద్దైపోయింది.

  " వర్షం కారణంగా బుధవారం జరగాల్సిన భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయింది " అని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండో టెస్టు కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు మంగళవారం సాయంత్రం కాన్పూర్ నుంచి ముంబై చేరుకున్నాయి. అక్యూవెదర్ నివేదిక ప్రకారం, బుధవారం మధ్యాహ్నం ముంబైలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం కూడా 50 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే సముద్రానికి సమీపంలోని పలు ప్రాంతాల్లో వరదల భయం కూడా ఉంది. అదే సమయంలో, గురువారం కూడా సాయంత్రం వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.


  మ్యాచ్ జరిగే శుక్రవారం కూడా వర్షం పడే సూచనలు కన్పిస్తున్నాయ్. శుక్రవారం వరుణుడు అడ్డుతగిలే ఛాన్సులు ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒక వేళ శుక్రవారం వరుణుడు అడ్డు తగలకపోయినా.. మ్యాచ్ సన్నాహకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గతేడాది ఇదే సమయంలో వచ్చి టూటూ తుఫాన్ కారణంగా వాంఖడే స్టేడియం తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న సంగతి తెలిసిందే.


  వర్షాలు కారణంగా ముంబైలో వరదలు సంభవించే అవకాశాలు ఎక్కువ. దీంతో, ముంబై టెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నట్టే. ఇక ఫస్ట్ మ్యాచ్‌లో చివరి క్షణం వరకు పోరాడిన భారత్.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. ఆజాజ్ పటేల్(23 బంతుల్లో 2 నాటౌట్), రచిన్ రవీంద్ర(91 బంతుల్లో 18 నాటౌట్) అడ్డుగోడలా నిలబడటంతో భారత విజయం చేజారింది.

  4/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ ఆఖరి రోజు ఆట ముగిసేసమయానికి 98 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిని తప్పించుకుంది. బ్యాడ్ లైట్ కారణంగా మరో 8 నిమిషాల ముందే అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేసారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. రెండో టెస్ట్ కి విరాట్ కోహ్లీ (Virat Kohli) అందుబాటులోకి రానున్నాడు. ఈ మ్యాచుకి విరాట్ కోహ్లీనే కెప్టెన్.

  ఇది కూడా చదవండి : కొత్త జట్లు తీసుకునే ఆ ఆరుగురు ఆటగాళ్లు ఎవరు..? ఆ స్టార్ ప్లేయర్లపైనే కన్ను...!

  మరోవైపు ఒమ్రికాన్ ఎఫెక్ట్‌.. భారత్‌ – న్యూజిలాండ్‌ రెండో టెస్ట్‌ పై పడింది. న్యూజిలాండ్‌ తో రెండో టెస్ట్‌ కు లిమిటెడ్‌ గానే ప్రేక్షకులను అనుమతి ఇస్తామని పేర్కొంది ముంబై క్రికెట్‌ అసోషియేషన్‌. ఈ నేపథ్యంలోనే 33 వేలు ఉన్న వాంఖడే స్టేడియ సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే మ్యాచ్‌ నిర్వహించనున్నామని స్పష్టం చేశారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Kane Williamson, Mumbai, Virat kohli, Weather report

  ఉత్తమ కథలు