IND VS NZ CHANGES IN BOTH TEAMS FANS ARE WAITING SERIES WITH HIGH EXPECTIONS EVK
IND vs NZ: మరో క్రికెట్ ఫైట్‌కు అంతా సిద్ధం.. ఎవరిది పైచేయి?
ప్రతీకాత్మక చిత్రం
IND vs NZ: ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ (Cricket Fans) కోసం మరో సిరీస్ సిద్ధమైంది. ఈ సారి నవంబర్ 17, 2021 నుంచి న్యూ జిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇరు జట్లలో మార్పుల నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ (Cricket Fans) కోసం మరో సిరీస్ సిద్ధమైంది. ఈ సారి నవంబర్ 17, 2021 నుంచి న్యూ జిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. యూఏఈలో టీ20 ప్రపంచకప్ ఆడిన కివీస్ నేరుగా భారత్‌కు వచ్చేసింది. టీమ్ ఇండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తరువాత టీం ఇండియా (Team Inda)లో చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోగా.. కోచ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రీ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), కోచ్ ద్రావిడ్ సారథ్యంలో బలమైన న్యూజిలాండ్ (NewZealand) జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారని క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే భారత కొత్త కోచ్ ద్రావిడ్ మాట్లాడుతూ ఒకరిద్దరిపైనే ఆధారపడితే విజయాలు సాధించలేమని.. అందుకే, జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను మలుచుకుంటామని అన్నారు. ప్రతి ఆటగాడు భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేలా ప్రయత్నిస్తామని తెలిపారు.
సొంత గడ్డపై కష్టం.. అయినా
టీం ఇండియాను సొంతగడ్డపై ఓడించడం న్యూజిలాండ్ టీం కాస్త కఠినమైన సవాలే. అయితే న్యూజిలాండ్ ప్లేయర్లు ఐపీఎల్ (IPL)లో ఆడడం ద్వారా ఇక్కడి పిచ్‌లపై కాస్త అనుభవం సాధించారు. దీని ద్వారా మెరుగైన ప్రదర్శనను కివీస్‌టీం నుంచి ఆశించవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మ్యాచ్ ఆరంభంలో ఎవరు వికెట్లు తీస్తారో వారికే మ్యాచ్‌పై ఆధిపత్యం ఉండవచ్చు. ఎందుకంటే ఇండియన్ పిచ్‌లపై త్వరగా వికెట్లు పడితే నిలదొక్కుకోవడం కష్టంగా ఉంటుంది. టీం ఇండియన్ ప్లేయర్లు సరైన ఫాంలో లేకపోవడం.. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఫైనల్ ఆడిన అనుభవం న్యూజిలాండ్ టీంకు అడ్వాంటేజ్ అనే చెప్పాలి.
న్యూ జిలాండ్ జట్టు : టిమ్ సౌథీ (కెప్టెన్), టాడ్ ఆస్టల్, ట్రెం ట్ బౌల్ట్, మార్క్ చాం పన్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, కేల్ జేమీసన్, ఆడమ్ మిల్నే , డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాట్న ర్, ఐష్ సోధి. టిమ్ సీఫర్ట్, టిమ్ సీఫర్ట్.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.