మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా చివరి దైన మూడో టి20కి భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు సిద్ధమయ్యాయి. నేపియర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. ఈ మ్యాచులో కేన్ మామ బదులు టిమ్ సౌతీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోసారి ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్ లకు నిరాశే ఎదురైంది. ఇప్పటికే తొలి టి20 వర్షం కారణంగా రద్దయ్యింది.
రెండో టి20లో భారత్ 65 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఘనవిజయం సాధించింది. దాంతో సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ ను భారత్ కోల్పోయే అవకాశం లేదు. గెలవాలంటే చివరి మ్యాచ్ లో గెలిస్తే చాలు.. వర్షంతో రద్దయినా భారత్ ఖాతాలోకి సిరీస్ చేరుతుంది. సిరీస్ ను గెలిచే అవకాశం న్యూజిలాండ్ కు లేదు. రెండో టి20లో గెలిస్తే సిరీస్ ను సమం చేసే అవకాశం మాత్రమే ఉంది.
తొలి మ్యాచ్ లో విజయం సాధించడంతో భారత్ సిరీస్ కోల్పోయే అవకాశం లేదు. ఓపెనర్లుగా రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ లు సత్తా చాటాల్సి ఉంది.రెండో టి20లో ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపించినా.. పంత్ మాత్రం విఫలం అయ్యాడు. గత కొంత కాలంగా పంత్ పేలవ ఫామ్ తో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు జట్టులో ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా రాణించాల్సి ఉంది. సూర్య కుమార్ యాదవ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా, దీపక్ హుడాలు బ్యాటింగ్ లో రాణించాల్సి ఉంది. బౌలింగ్ లో చాహల్, సిరాజ్ మరోసారి కీలకం కానున్నారు. అర్ష్ దీప్ ఫర్వాలేదన్పిస్తున్నాడు.
మరోవైపు.. న్యూజిలాండ్ జట్టు కేన్ మామ లేకుండానే బరిలోకి దిగుతుంది. కేన్ విలియమ్సన్ స్థానంలో టిమ్ సౌతీ మూడో టీ20 మ్యాచుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కేన్ విలియమన్స్ స్థానంలో మార్క్ ఛాప్ మెన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
తుది జట్లు :
టీమిండియా : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, సిరాజ్, చహల్, అర్ష్ దీప్ సింగ్,
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ ఛాప్ మెన్ , జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌతీ, అడమ్ మిల్నే, ఇష్ సోదీ, లూకీ ఫెర్గ్యూసన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hardik Pandya, Ind vs Nz, India vs newzealand, Rishabh Pant, Sanju Samson