హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 3rd T20I : సిరాజ్, అర్ష్ దీప్ సూపరో సూపర్.. మాటల్లేవ్ అంతే.. టీమిండియా టార్గెట్ ఇదే..!

IND vs NZ 3rd T20I : సిరాజ్, అర్ష్ దీప్ సూపరో సూపర్.. మాటల్లేవ్ అంతే.. టీమిండియా టార్గెట్ ఇదే..!

PC : TWITTER

PC : TWITTER

IND vs NZ 3rd T20I : డేవాన్ కాన్వే (49 బంతుల్లో 59 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ ( 33 బంతుల్లో 54 పరుగులు ; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరి ధాటికి భారీ స్కోరు దిశగా సాగిన కివీస్ ఇన్నింగ్స్ సిరాజ్, అర్షదీప్ ల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నేపియర్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కివీస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. డేవాన్ కాన్వే (49 బంతుల్లో 59 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ ( 33 బంతుల్లో 54 పరుగులు ; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరి ధాటికి భారీ స్కోరు దిశగా సాగిన కివీస్ ఇన్నింగ్స్ సిరాజ్, అర్షదీప్ ల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆఖరి ఓవర్లలో ఆ జట్టు బ్యాటర్లు పరుగులు చేయడం పక్కన పెడితే.. పోటీ పడీ మరీ వికెట్లు సమర్పించుకున్నారు. మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ నాలుగు వికెట్లతో దుమ్మురేపారు. హర్షల్ పటేల్ కి ఒక వికెట్ దక్కింది. సిరాజ్ అయితే నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. కేవలం 30 పరుగులు చేసి ఆఖరి ఎనిమిది వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు డేంజరస్ ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి.. అర్ష్ దీప్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో.. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. ఆ తర్వాత డేవాన్ కాన్వేతో కలిసిన మార్క్ ఛాప్ మెన్ దూకుడుగా ఆడటానికి ప్రయత్నించాడు. రెండు బౌండరీలతో అలరించాడు. అయితే.. 12 బంతుల్లో 12 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే.. ఆ తర్వాత మూడో వికెట్ కి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు డేవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్.

కాన్వే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదితే.. గ్లెన్ ఫిలిప్స్ మాత్రం ఎటాకింగ్ గేమ్ ఆడాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడి జోరుకు సిరాజ్ బ్రేకులు వేశాడు. సిరాజ్ బౌలింగ్ లో 33 బంతుల్లో 54 పరుగులు చేసిన ఫిలిప్స్ భువనేశ్వర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. మూడో వికెట్ కు 86 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేకు పడింది.

ఇక, అక్కట్నుంచి న్యూజిలాండ్ బ్యాటర్లకు చెక్ పెట్టారు టీమిండియా బౌలర్లు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ టీమ్. ముఖ్యంగా సిరాజ్ బాయ్ తన బౌలింగ్ లో చుక్కలు చూపించాడు. సిరాజ్ సూపర్ స్పెల్ కు .. అర్ష్ దీప్ మెరుపులు తోడయ్యాయి. దీంతో.. భారీ స్కోరు చేస్తుందనుకున్న కివీస్ సాధారణ స్కోరుకే మాత్రమే పరిమితమైంది.

టీమ్ హ్యాట్రిక్ :

అర్ష్ దీప్ వేసిన 19 వ ఓవర్ లో టీమ్ హ్యాట్రిక్ నమోదైంది. ఫస్ట్ రెండు బంతులకి అర్ష్ దీప్ వికెట్లు తీస్తే.. మూడో బంతికి సిరాజ్ రనౌట్ చేశాడు. దీంతో.. జట్టు ఖాతాలో హ్యాట్రిక్ చేరింది.

తుది జట్లు :

టీమిండియా : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, సిరాజ్, చహల్, అర్ష్ దీప్ సింగ్,

న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ ఛాప్ మెన్ , జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌతీ, అడమ్ మిల్నే, ఇష్ సోదీ, లూకీ ఫెర్గ్యూసన్

First published:

Tags: Hardik Pandya, Ind vs Nz, India vs newzealand, Mohammed Siraj, Team India

ఉత్తమ కథలు