Home /News /sports /

IND VS NZ 3RD T20I HARSHAL PATEL HIT WICKET AFTER KL RAHUL BECAME 2ND INDIAN TO GET OUT HIT WICKET IN T20I WATCH THIS VIDEO JNK

Harshal Patel Hit Wicket: అలా ఎలా అవుటవుతావ్ హర్షల్ బ్రో.. టీ20ల్లో చెత్త రికార్డు నమోదు చేసిన హర్షల్ పటేల్

ఇదేం చెత్త రికార్డు హర్షల్ బ్రో.. వికెట్లు ఎక్కడున్నాయో చూసుకోవాలి కదా.. (PC: BCCI)

ఇదేం చెత్త రికార్డు హర్షల్ బ్రో.. వికెట్లు ఎక్కడున్నాయో చూసుకోవాలి కదా.. (PC: BCCI)

Harshal Patel: కోల్‌కతా వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య 3వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ చివరి ఓవర్లలో భారీ షాట్‌లు కొట్టాడు. హర్షల్ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే అతడి పేరు మీద ఒక చెత్త రికార్డు నమోదయ్యింది.

ఇంకా చదవండి ...
    ఇండియా (India) - న్యూజీలాండ్ (New Zealand) మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసింది. కోల్‌కతా వేదికగా జరిగిన చివరి టీ20లో భారత జట్టు 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి టీమ్ ఇండియా బ్యాటింగ్ చేసింది. భారత్ తరఫున రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌కిది రెండో అర్ధశతకం. భారత కెప్టెన్ తన కొత్త ఓపెనింగ్ భాగస్వామి ఇషాన్ కిషన్‌ (Ishan Kishan) కలిసి తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలో 69 పరుగులు జోడించాడు. అదే స్కోరు వద్ద ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ త్వరగానే అవుటయ్యారు. రెండు క్విక్ వికెట్లు పడటంతో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పెవీలియన్ చేరాడు. ఇక అప్పుడు శ్రేయస్ అయ్యర్‌, వెంకటేష్‌ అయ్యర్‌ జోడీ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. అయితే స్కోరు బోర్డుపై 140 పరుగుల వరకు రాబట్టిన తర్వాత ఇద్దరూ కూడా ఔటయ్యారు.

    దీంతో భారత జట్టు కనీసం 160 పరుగులైనా చేస్తుందా అని అందరూ భావించారు. అయినప్పటికీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హర్షల్ పటేల్ (Harshal Patel) కొన్ని మంచి షాట్లు ఆడాడు. హర్యాణా తరపున ఓపెనింగ్ బ్యాటింగ్ చేసే హర్షల్ తనలో బ్యాటింగ్ చేసే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఆడమ్ మిల్నే వేసిన 17వ ఓవర్లో ఫోర్ కొట్టి తన ఖాతా తెరిచాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో హర్షల్ మరో బౌండరీ బాదాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఒక భారీ సిక్సర్ బాదాడు. హర్షల్ పటేల్ దూకుడు చూసి భారత జట్టు భారీ స్కోర్ దిశగా వెళ్తున్నట్లే అనిపించింది.l

    Coach Dravid's Rule: ఆ ఐదుగురు తప్ప మిగతా వాళ్లు నైటంతా పార్టీ చేసుకోవచ్చు.. ఆర్డర్ పాస్ చేసిన ద్రవిడ్ సార్









    అయితే ఫెర్గూసన్ అదే ఓవర్‌లో మూడో బంతిని ఆఫ్-స్టంప్ వెలుపల బౌల్డ్ చేశాడు. హర్షల్ పాయింట్ దిశగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అలా చేస్తూ హిట్ వికెట్‌గా నిలిచాడు. ధాటిగా ఆడుతున్న హర్షల్ పటేల్ చాలా వింతగా ఔట్ కావడంతో వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యపోయారు. క్రీజులో చాలా లోపలకు నిలబడిన హర్షల్ బ్యాటు వికెట్లకు తగిలి బెయిల్స్ కిందపడిపోయాయి. దీంతో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో హిట్‌ వికెట్‌ అయిన రెండో భారత ఆటగాడిగా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. అతని కంటే ముందు కేఎల్ రాహుల్ 2018లో శ్రీలంకపై హిట్ వికెట్ అయ్యాడు.
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, KL Rahul, T20, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు