IND vs NZ 3rd T20 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య జరుగుతున్న టి20 సిరీస్ ఆఖరి పోరాటానికి వచ్చేసింది. వన్డేల్లో వైట్ వాష్ అయిన న్యూజిలాండ్ జట్టు.. తొలి టి20లో నెగ్గింది. ఇక రెండో టి20లోనూ చివరి వరకు పోరాడింది. ఈ క్రమంలో మూడో టి20లో నెగ్గి సిరీస్ ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఇక తొలి టి20లో ఓడిన భారత్ (India).. రెండో టి20లో కిందా మీదా పడుతూ నెగ్గి సిరీస్ ను సమం చేసింది. అయితే మూడో టి20లో నెగ్గి టి20 సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలనే పట్టుదల మీద ఉంది. మూడో టి20 బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ సాయంత్రం గం. 7 లకు ఆరంభం కానుంది.
ఒక మార్పుతో భారత్
ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసే అవకాశం ఉంది. లక్నో మ్యాచ్ లో ఆడిన యుజుంవేంద్ర చహల్ ను పక్కన పెట్టి అతడి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ను తీసుకునే అవకాశం ఉంది. దాంతో పృథ్వీ షా మరోసారి బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో భారత బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఓపెనర్లుగా శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ ను విఫలం అయ్యారు. ఇక రాహుల్ త్రిపాఠి కూడా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అయితే వీరికి మరో అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో భారత్ ఫర్వాలేదనిపిస్తుంది. లక్నో స్పిన్ ట్రాక్ పై భారత స్పిన్నర్లు పండగ చేసుకున్నారు. ఇక అర్ష్ దీప్ సింగ్ కూడా మళ్లీ లయ అందుకున్నాడు. ఈ క్రమంలో మూడో టి20లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇక మరోవైపు కివీస్ కూడా ఈ మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.
పిచ్ ఎలా ఉండనుంది?
అహ్మదాాబాద్ వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంది. లక్నో పిచ్ లా కాకుండా ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ గా ఉండనుంది. ఈ మ్యాచ్ కోసం బ్యాటింగ్ వికెట్ ను తయారు చేసినట్లు వార్తలు అందుతున్నాయి. అదే జరిగితే పరుగుల వరద పారడం ఖాయం.
తుది జట్లు అంచనా
టీమిండియా
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, శివమ్ మావి, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్
సాంట్నెర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్ వెల్, మార్క్ చాప్ మన్, ఇష్ సోధి, పెర్గూసన్, టిక్నర్, డపీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ahmedabad, Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Shubman Gill, Surya Kumar Yadav, Team India