IND vs NZ 3rd T20 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య జరుగుతున్న టి20 సిరీస్ ఆఖరి పోరాటానికి వచ్చేసింది. వన్డేల్లో వైట్ వాష్ అయిన న్యూజిలాండ్ జట్టు.. తొలి టి20లో నెగ్గింది. ఇక రెండో టి20లోనూ చివరి వరకు పోరాడింది. ఈ క్రమంలో మూడో టి20లో నెగ్గి సిరీస్ ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఇక అదే సమయంలో రెండో మ్యాచ్ లో నెగ్గిన భారత్.. సిరీస్ ను సజీవంగా ఉంచగలిగింది. ఈ క్రమంలో మరికాసేపట్లో జరిగే మూడో టి20లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. అహ్మదాబాద్ వేదికగా మరికాసేపట్లో ఆరంభమయ్యే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. యుజువేంద్ర చహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ను తీసుకుంది. దాంతో పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైంది. కివీస్ కూడా ఒక మార్పు చేసింది. డఫీ స్థానంలో బెంజబిన్ లిస్టర్ ను తీసుకుంది.
ఊహించిన జట్టే
ఊహించనట్లుగానే మూడో టి20 కోసం భారత్ తుది జట్టును ఎంచుకుంది. లక్నో వికెట్ స్పిన్ కు సహకరించేలా ఉండటంతో ఒక పేసర్ ను తగ్గించిన భారత్.. యుజువేంద్ర చహల్ ను తీసుకుంది. ఇక అహ్మదాబాద్ వికెట్ స్పిన్ కంటే కూడా పేసర్లకు సహకరించేలా ఉంది. దాంతో చహల్ ను పక్కన పెట్టిన భారత్ ఉమ్రాన్ మాలిక్ ను తీసుకుంది. ఇక న్యూజిలాండ్ కూడా ఒక మార్పు చేసింది. గత రెండు మ్యాచ్ ల్లోనూ పెద్దగా ప్రభావం చూపని డఫీని పక్కన పెట్టి బెంజమిన్ లిస్టర్ కు అవకాశం ఇచ్చింది.
అండర్ 19 విజేతలకు సన్మానం
గత ఆదివారం దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 మహిళల ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలిచింది. తొలిసారి జరిగిన ఈ టోర్నీలో ఇండియన్ టీం విశ్వవిజేతగా నిలిచింది. షఫాలీ వర్మ నాయకత్వంలోని టీమిండియా ఫైనల్లో ఇంగ్లండ్ పై 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ క్రమంలో భారత్ కు చేరుకున్న యంగ్ చాంపియన్స్ ను బీసీసీఐ సన్మానించింది. మూడో టి20 ఆరంభానికి ముందు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ యంగ్ చాంప్స్ ను సత్కరించాడు.
తుది జట్లు
టీమిండియా
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, శివమ్ మావి, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్
సాంట్నెర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్ వెల్, మార్క్ చాప్ మన్, ఇష్ సోధి, పెర్గూసన్, టిక్నర్, బెంజమిన్ లిస్టర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Shubman Gill, Surya Kumar Yadav