హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 3rd T20 : న్యూజిలాండ్ తో మూడో టి20.. భారీ మార్పులకు సిద్ధమైన టీమిండియా.. తుది జట్టు ఇదే

IND vs NZ 3rd T20 : న్యూజిలాండ్ తో మూడో టి20.. భారీ మార్పులకు సిద్ధమైన టీమిండియా.. తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs NZ 3rd T20 : మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా చివరి దైన మూడో టి20కి భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు సిద్ధమయ్యాయి. నేపియర్ వేదికగా మంగళవారం మూడో టి20 జరగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 3rd T20 : మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా చివరి దైన మూడో టి20కి భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు సిద్ధమయ్యాయి. నేపియర్ వేదికగా మంగళవారం మూడో టి20 జరగనుంది. తొలి టి20 వర్షం కారణంగా రద్దయ్యింది. రెండో టి20లో భారత్ 65 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఘనవిజయం సాధించింది. దాంతో సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ ను భారత్ కోల్పోయే అవకాశం లేదు. గెలవాలంటే చివరి మ్యాచ్ లో గెలిస్తే చాలు.. వర్షంతో రద్దయినా భారత్ ఖాతాలోకి సిరీస్ చేరుతుంది. సిరీస్ ను గెలిచే అవకాశం న్యూజిలాండ్ కు లేదు. రెండో టి20లో గెలిస్తే సిరీస్ ను సమం చేసే అవకాశం మాత్రమే ఉంది.

మార్పులకు సిద్ధం

తొలి మ్యాచ్ లో విజయం సాధించడంతో భారత్ సిరీస్ కోల్పోయే అవకాశం లేదు. దాంతో మూడో టి20లో టీమిండియా మార్పులకు సిద్ధమైందని సమాచారం. రెండో టి20లో అవకాశం రాని సంజూ సామ్సన్, గిల్, ఉమ్రాన్ మాలిక్ లు మూడో మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. దీపక్ హుడా రెండో టి20లో నాలుగు వికెట్లు తీయడంతో అతడిని రెండో స్పిన్నర్ గా హార్దిక్ పాండ్యా ఉపయోగించే వీలు ఉంది. ఓపెనర్లుగా రిషభ్ పంత్, గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ వన్ డౌన్ లో ఆడే అవకాశం ఉంది. రెండో టి20లో ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపించినా.. పంత్ మాత్రం విఫలం అయ్యాడు. గత కొంత కాలంగా పంత్ పేలవ ఫామ్ తో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు జట్టులో ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా రాణించాల్సి ఉంది.

ఉమ్రాన్ మాలిక్ కు కీలకం

మూడో టి20లో ఉమ్రాన్ మాలిక్ కు తుది జట్టులో ఆడే అవకాశం వస్తే అతడు ఎలా ఆడతాడనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది. 2024 టి20 ప్రపంచకప్ సమయానికి ఉమ్రాన్ మాలిక్ ను రెడీ చేయాల్సి ఉంది. దాంతో అతడికి ఇప్పటి నుంచే వీలైనన్ని మ్యాచ్ లను ఆడించాల్సి ఉంది. ఇక అదే సమయంలో సంజూ సామ్సన్ కు కూడా వీలైనన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంది.

టీమిండియా  తుది జట్టు (అంచనా)

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్, గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్, దీపక్ హుడా, సిరాజ్, చహల్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

First published:

Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, New Zealand, Rishabh Pant, Sanju Samson, Shreyas Iyer, Surya Kumar Yadav, Team India

ఉత్తమ కథలు