హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 3rd ODI : రఫ్పాడించిన కుల్దీప్, శార్దుల్.. మూడో వన్డేలోనూ టీమిండియాదే విజయం

IND vs NZ 3rd ODI : రఫ్పాడించిన కుల్దీప్, శార్దుల్.. మూడో వన్డేలోనూ టీమిండియాదే విజయం

PC : BCCI

PC : BCCI

IND vs NZ 3rd ODI : కొత్త సంవత్సరంలో టీమిండియా (Team India) జోరు మీదుంది. ఇప్పటికే శ్రీలంక (Sri Lanka)తో జరిగిన టి20, వన్డే సిరీస్ లను నెగ్గిన భారత్.. తాజాగా న్యూజిలాండ్ (New Zealand)పై కూడా అదరగొట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 3rd ODI : కొత్త సంవత్సరంలో టీమిండియా (Team India) జోరు మీదుంది. ఇప్పటికే శ్రీలంక (Sri Lanka)తో జరిగిన టి20, వన్డే సిరీస్ లను నెగ్గిన భారత్.. తాజాగా న్యూజిలాండ్ (New Zealand)పై కూడా అదరగొట్టింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలోనూ భారత్ దే పైచేయి. మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై భారీ విజయాన్ని అందుకుంది. 386 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డెవోన్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. హెన్రీ నికోల్స్  (42) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ మినహా మిగిలిన ప్లేయర్లు దారుణంగా విఫలం అయ్యారు. దాంతో భారత్ ఖాతాలో మూడో వన్డే కూడా చేరింది.

భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ను హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ లోనే దెబ్బ తీశాడు. డేంజరస్ బ్యాటర్ ఫిన్ అలెన్ (0)ను బౌల్డ్ చేసి భారత్ కు తొలి వికెట్ ను అందించాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన నికోల్స్ తో కలిసి మరో ఓపెనర్ కాన్వే జట్టును ముందుకు నడిపాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 105 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జంటను కుల్దీప్ విడదీశాడు. నికోల్స్ కుల్దీప్ బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్ (24) కాసేపు కాన్వేకు అండగా నిలిచాడు. కాన్వే, మిచెల్ జంట మూడో వికెట్ కు 78 పరుగులు జోడించింది. అయితే ఈ దశలో బౌలింగ్ కు వచ్చిన శార్దుల్ వరుస బంతుల్లో మిచెల్, టామ్ లేథమ్ (0) లను అవుట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. సెంచరీ అనంతరం కాన్వే కూడా అవుటయ్యాడు. ఆశలు పెట్టుకున్న బ్రేస్ వెల్ (26)ను ఇషాన్ కిషన్ స్టంపౌట్ చేశాడు. దాంతో కివీస్ ఓటమి ఖాయమైంది.

అంతకుముందు ఓపెనర్లు శుబ్ మన్ గిల్, రోహిత్ శర్మలు శతకాలతో చెలరేగారు. గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోయారు. వీరి ధాటికి భారత్ ఒక దశలో కేవలం 24.1 ఓవర్లలో 200 మార్కును అందుకుంది. ఆ సమయంలో భారత్ 450 పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే సెంచరీల తర్వాత వీరిద్దరూ అవుటవ్వడం.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ విఫలం అవ్వడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. కివీస్ బౌలర్ డఫీ, టిక్నర్ లు చెరో 3 వికెట్లు తీశారు.

First published:

Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Rohit sharma, Shubman Gill, Surya Kumar Yadav, Virat kohli

ఉత్తమ కథలు