హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 3rd ODI : రోహిత్, గిల్ సెంచరీలు.. ఇండోర్ లో ఓపెనర్ల పరుగుల జాతర.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

IND vs NZ 3rd ODI : రోహిత్, గిల్ సెంచరీలు.. ఇండోర్ లో ఓపెనర్ల పరుగుల జాతర.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

PC : BCCI

PC : BCCI

IND vs NZ 3rd ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఇండోర్ లో న్యూజిలాండ్ (New Zealand)తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ భారత (India) బ్యాటింగ్ అదరగొట్టింది. ఓపెనర్లు శుబ్ మన్ గిల్ (Shubman Gill), రోహిత్ శర్మ (Rohhit Sharma)లు శతకాలతో చెలరేగారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 3rd ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఇండోర్ లో న్యూజిలాండ్ (New Zealand)తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ భారత (India) బ్యాటింగ్ అదరగొట్టింది. ఓపెనర్లు శుబ్ మన్ గిల్ (Shubman Gill), రోహిత్ శర్మ (Rohhit Sharma)లు శతకాలతో చెలరేగారు. గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోయారు. వీరి ధాటికి భారత్ ఒక దశలో కేవలం 24.1 ఓవర్లలో 200 మార్కును అందుకుంది. ఆ సమయంలో భారత్ 450 పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే సెంచరీల తర్వాత వీరిద్దరూ అవుటవ్వడం.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ విఫలం అవ్వడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. కివీస్ బౌలర్ డఫీ, టిక్నర్ లు చెరో 3 వికెట్లు తీశారు.

రోహిత్ విశ్వరూపం

ఈ ఏడాది రోహిత్ శర్మ మంచి టచ్ లో ఉన్నాడు. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే భారీ స్కోర్లను చేయడంలో మాత్రం విఫలం అవుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ చూస్తే చూడాలని అతడి అభిమానులు ఎదురు చూస్తునే ఉన్నారు. అయితే సుదీర్ఘ నిరీక్షణకు రోహిత్ తెర దించాడు. వన్డేల్లో చివరిసారిగా ఎప్పుడో 2020 జనవరి 19న సెంచరీ బాదిన రోహిత్.. మళ్లీ ఆ ఘనతను రిపీట్ చేయలేకపోయాడు. అయితే మూడేళ్ల నిరీక్షణ అనంతరం రోహిత్ మళ్లీ వన్డేల్లో శతకంతో మెరిశాడు.

టాస్ గెలిచిన లేథమ్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తుండటంతో భారత ఓపెనర్లు తొలి బంతి నుంచే రెచ్చిపోయారు. టి20 ఫార్మాట్ లో ఆడినట్లు బౌలర్లను దంచి కొట్టారు. ఈ క్రమంల ోభారత్ 200 మార్కును 25 ఓవర్ల లోపే చేరుకుంది. ఇరువురు ప్లేయర్లు కూడా సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రోహిత్ కు ఇది 30వ వన్డే సెంచరీ కావడం విశేషం. అయితే సెంచరీలు పూర్తయ్యాక. వీరిద్దరూ వెంట వెంటనే అవుటయ్యారు. ఇక్కడి నుంచి భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది.

విరాట్ కోహ్లీ (36) తనకు లభించిన ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్ గా మార్చలేకపోయాడు. ఇషాన్ కిషన్ (17) కోహ్లీతో సమన్వయలోపం కారణంగా రనౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (14) విఫలం అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ (9) నిరాశ పరిచాడు. దాంతో 212/0గా ఉన్న భారత్ 313/6గా మారిపోయింది. అయితే ఈ దశలో హార్దిక్ పాండ్యా (54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. శార్దుల్ ఠాకూర్ తో కలిసి 8వ వికెట్ కు 54 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో భారత్ 385 పరుగుల స్కోరును అందుకుంది. భారత్ కు లభించిన ఆరంభానికి ఇది తక్కువ స్కోరే. కానీ.. వన్డేల్లో 385 పరుగులను ఛేజ్ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు.

First published:

Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Rohit sharma, Shubman Gill, Surya Kumar Yadav, Team India, Virat kohli

ఉత్తమ కథలు