IND vs NZ 3rd ODI : తొలి రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత్ (India).. న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. దాంతో నామమాత్రంగా జరిగే మూడో వన్డేలో సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చి యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని టీమిండియా (Team India) చూస్తుంది. ఇక మరోవైపు తొలి రెండు వన్డేల్లో ఓడి డీలా పడ్డ కివీస్ జట్టు.. చివరి వన్డేలో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. ఇండోర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానుంది. ఇండోర్ వికెట్ బ్యాటింగ్ వికెట్ దాంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది.
హార్దిక్, షమీకి విశ్రాంతి
మూడో వన్డే కోసం భారత్ ఇద్దరు ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యాతో పాటు మొహమ్మద్ షమీలకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. న్యూజిలాండ్ తో జరిగే టి20 సిరీస్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో అతడికి విశ్రాంతి ఇవ్వాలనే యోచనలో టీమ్ మేనేజ్ మెంట్ ఉన్నట్లు సమాచారం. అతడితో పాటు షమీ కూడా మూడో వన్డేకు దూరమయ్యే అవకాశం ఉంది. వీరి స్థానాల్లో షాబాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్ లు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
అందరి కళ్లూ వారిద్దరిపైనే
శ్రీలంకపై రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి వన్డేలో 8 పరుగులు చేసిన అతడు.. రెండో వన్డేలో 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఆరంభాలు లభిస్తున్నా వాటిని భారీ ఇన్నింగ్స్ లు గా మార్చలేకపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బిగ్ ఇన్నింగ్స్ ఆడితే చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రెండో వన్డేలో అర్ధ సెంచరీ చేసిన రోహిత్.. ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీరితో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లు కూడా రాణిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం.
టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Mohammed Shami, Mohammed Siraj, Virat kohli